Fashion

నిద్రలేమితో మధుమేహం ముప్పు

నిద్రలేమితో మధుమేహం ముప్పు

రోజులో కేవలం మూడు నుంచి అయిదు గంటలు మాత్రమే నిద్రించేవారికి టైప్‌ 2 మధుమేహ ముప్పు ఎక్కువగా ఉంటుందని స్వీడన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పండ్లు, కూరగాయలు, ముతక ధాన్యాలు భుజిస్తే మధుమేహ ముప్పు తగ్గినా, అరకొర నిద్ర వల్ల పోషకాహార ప్రయోజనమూ నశిస్తుందని తెలిపారు. రోజులో కనీసం ఆరు గంటల నిద్ర, సమతుల ఆహారంతో మాత్రమే మధుమేహ ప్రమాదాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. 5 లక్షలమంది జన్యు సమాచారాన్ని పదేళ్లపాటు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z