NRI-NRT

ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ దారుణహత్య

ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ దారుణహత్య

ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన మహిళ శ్వేత దారుణహత్యకు గురైంది. భర్త అశోక్‌రాజ్‌ ఆమెను హతమార్చాడు. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. భార్యను చంపిన తర్వాత కుమారుడిని తీసుకుని అశోక్‌ హైదరాబాద్‌ వచ్చాడు. అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసును దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు.. అశోక్‌రాజే హతమార్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z