DailyDose

బాయ్‌ఫ్రెండ్‌ను హతమార్చిన మైనర్ బాలిక-CrimeNews-Mar 29 2024

బాయ్‌ఫ్రెండ్‌ను హతమార్చిన మైనర్ బాలిక-CrimeNews-Mar 29 2024

* సైదాబాద్ ప‌రిధిలో చైన్ స్నాచింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ వృద్ధుడి మెడ‌లో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోతుండ‌గా, దొంగ‌ను ఇద్ద‌రు యువ‌కులు వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. అనంత‌రం పోలీసుల‌కు దొంగ‌ను అప్ప‌గించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మాదన్నపేటకు చెందిన ప్రకాష్(61) వెల్డింగ్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం సైదాబాద్ శంఖేశ్వర్ బజార్ పెట్రోల్ బంక్ వద్ద కారులో దిగుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి ప్రకాష్ చుట్టూ తిరుగుతూ భయబ్రాంతులకు గురి చేసి మెడలో ఉన్న 2 తులాల‌ బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. దీంతో ఆ వృద్ధుడు వారిని పట్టుకునే క్రమంలో కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన ఇద్దరు యువకులు ఆ దొంగలను వెంబడించి ఒక దొంగను పట్టుకున్నారు. మరో దొంగ ఆటోలో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* లైంగిక సంబంధం కోసం బలవంతం చేస్తుండటంతో బాయ్‌ఫ్రెండ్‌ను బాలిక చంపింది. స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేసింది. దర్యాప్తులో ఈ విషం తెలుసుకున్న పోలీసులు షాక్‌ అయ్యారు. ఇద్దరు మైనర్‌ బాలికలను అరెస్ట్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పుట్సురా గ్రామానికి చెందిన 18 ఏళ్ల వీరేంద్ర యాదవ్, తన సోదరి పునితా యాదవ్‌తో కలిసి బలరాంపూర్‌లో నివసిస్తున్నాడు. కాగా, వీరేంద్ర తీవ్రంగా గాయపడినట్లు స్నేహితురాళ్ల ద్వారా పునీతాకు తెలిసింది. రూమ్‌లో అచేతనంగా పడి ఉన్న సోదరుడ్ని ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో సోదరుడు వీరేంద్ర మృతిపై సోదరి పునీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. పునీతా స్నేహితురాళ్లైన ఇద్దరు మైనర్‌ బాలికలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిద్దరిలో ఒక బాలిక, వీరేంద్ర మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకున్నారు. అయితే లైంగిక సంబంధం కోసం వీరేంద్ర బలవంతం చేస్తుండటంతో స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి చంపినట్లు పోలీసులకు ఆ బాలిక చెప్పింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మైనర్‌ బాలికలను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* కోవిడ్ సమయంలో ఐటీ జాబ్‌ కోల్పోయిన టెక్కీ దొంగగా మారింది. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల నుంచి విలువైన ల్యాప్‌టాప్‌లను చోరీ చేస్తున్నది. తన రాష్ట్రానికి వెళ్లి వాటిని విక్రయిస్తున్నది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో ఆమెను అరెస్ట్‌ చేశారు. 26 ఏళ్ల జస్సీ అగర్వాల్, ఐటీ సంస్థలో జాబ్‌ కోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు వచ్చింది. అయితే కరోనా సమయంలో ఐటీ ఉద్యోగం కోల్పోయింది. కాగా, జస్సీ అగర్వాల్ ఆ తర్వాత చోరీల బాటపట్టింది. పేయింగ్ గెస్ట్ వసతి గృహాల నుంచి ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్లు, మొబైల్‌ ఫోన్లు చోరీ చేస్తున్నది. వాటిని నోయిడాకు తీసుకెళ్లి బ్లాక్‌ మార్కెట్‌ విక్రయిస్తున్నది. పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉండే ఒక మహిళ తన ల్యాప్‌టాప్‌ చోరీపై ఫిర్యాదు చేసింది.

* తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఆదేశాలతో పనిచేసినట్లు గట్టుమల్లు చెప్పినట్లు సమాచారం. మరోవైపు రాధాకిషన్‌రావును కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది.

* రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద ఫోన్‌ను చోరీ చేసేందుకు యత్నించాడో దొంగ. అదే సమయంలో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో చిక్కి అరెస్టయ్యాడు. ఆ తర్వాత దొంగ వద్ద లభించిన ఫోన్‌ ఆధారంగా ఓ మర్డర్‌ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జాహిద్‌ జైదీ అనే వ్యక్తి రైలులో సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా.. ఓ వ్యక్తి అతడి ఫోన్‌ను తస్కరించే యత్నం చేశాడు. వెంటనే ప్రయాణికుడు అప్రమత్తమై.. పారిపోతున్న దొంగను వీడియోలో రికార్డు చేశాడు. దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి దొంగను పట్టుకోవాలని పోలీసులను కోరాడు. వీడియో వైరలవ్వడంతో స్పందించిన కల్యాణ్ రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. ఇటీవల చోటుచేసుకున్న మృతి ఘటనకు అసలు కారణం తెలిసింది. ‘‘నిందితుడిని అరెస్టు చేశాం. అతడిని ఠానేకు చెందిన జాదవ్‌గా గుర్తించాం. అతడి వద్ద స్విచ్ఛాఫ్‌ చేసి ఉన్న మొబైల్ ఫోన్‌ను ఆన్ చేయగా.. అది పుణెకు చెందిన ప్రభాస్ భాంగేదిగా గుర్తించాం. బ్యాంకు ఉద్యోగి అయిన ఆయన హోలీ కోసం పుణె నుంచి కల్యాణ్‌లోని తన నివాసానికి వచ్చాడు. అనంతరం మార్చి 25 అర్ధరాత్రి పుణెకు తిరిగి వెళ్తుండగా విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి పడి మృతి చెందాడు. అప్పటి నుంచి అతడి మరణానికి కారణాలు తెలియరాలేదు. అతడి ఫోన్‌ను జాదవే దొంగలించాడు. దానిని తిరిగి లాక్కోవడానికి చేసిన ప్రయత్నంలో భాంగే కదులుతున్న రైలులోంచి కిందపడి మరణించాడు’’ అని పోలీసులు వివరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z