NRI-NRT

ఒహాయోలో గద్దె సత్యసాయి అనుమానస్పద మృతి

ఒహాయోలో గద్దె సత్యసాయి అనుమానస్పద మృతి

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఓహియో స్టేట్‌ క్లీవ్‌లాండ్‌లో ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి చనిపోయాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొంది. ఉమా సత్యసాయి గద్దె స్వస్థలం, ఇతర నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది. అయితే విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z