* ప్రభుత్వరంగ బీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా’కు అదానీ గ్రూప్‌లో (Adani Group) ఉన్న పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో 59 శాతం పుంజుకుంది. అమెరికన్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్ నమోదిత కంపెనీల షేర్ల విలువ భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఫలితంగా ఎల్‌ఐసీ రాబడి సైతం అదే స్థాయిలో కుంగింది. ఎట్టకేలకు ఆయా కంపెనీల షేర్లు తిరిగి పుంజుకోవటంతో ఎల్‌ఐసీ పెట్టుబడులకు 2023-24లో మంచి ప్రతిఫలాలు దక్కాయి. అదానీ గ్రూప్ సంస్థల్లో ఎల్‌ఐసీ (LIC) పెట్టుబడుల విలువ 2023 మార్చి 31 నాటికి రూ.38,471 కోట్లుగా ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి అది రూ.61,210 కోట్లకు పెరిగింది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌పై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిపిందే. దీంతో ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్న ఎల్‌ఐసీ నిర్ణయంపైనా అనేక అనుమానాలు తలెత్తాయి. ఫలితంగా పలు నియంత్రణా సంస్థలు దీనిపై తనిఖీలు నిర్వహించాయి.
* దేశంలో బుల్లెట్ రైళ్ల (Bullet Trains)కు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక హామీ ఇచ్చారు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్న ఆయన.. ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లకూ ఈ రైళ్ల సేవలు విస్తరిస్తామన్నారు. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలు కానుందని చెప్పారు. ‘సంకల్ప్ పత్ర’ పేరిట భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఇవి పూర్తి కావచ్చాయి. అదేవిధంగా తూర్పు, ఉత్తర, దక్షిణ భారత్‌కు ఒక్కోటి చొప్పున బుల్లెట్ రైలు రానుంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటి వరకు సాధించిన అనుభవాలతో ఈ మూడు ప్రాంతాలకు బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు భాజపా కట్టుబడి ఉందన్నారు.
* కృష్ణా జిల్లా మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. వాటిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో శనివారం వేలం వేయగా వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్(మావ్)ను ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడుతారని అందుకే అంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు.
* తక్కువ టెన్యూర్ ఉండి ఎక్కువ వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కోసం చూస్తున్నారా.. మీలాంటివారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎస్‌బీఐ సర్వోత్తం ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 1 లేదా 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఇతర పథకాలతో పోలిస్తే, ఇది అధిక వడ్డీని అందిస్తుంది. తక్కువ టెన్యూర్ ఉండి ఎక్కువ వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కోసం చూస్తున్నారా.. మీలాంటివారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎస్‌బీఐ సర్వోత్తం ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 1 లేదా 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఇతర పథకాలతో పోలిస్తే, ఇది అధిక వడ్డీని అందిస్తుంది. ఈ సర్వోత్తం ఎఫ్‌డీ పథకంపై ఎస్‌బీఐ 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ. ఇది కాకుండా ఈ పథకం అతిపెద్ద ఫీచర్ ఏంటంటే.. దాని కాలవ్యవధి. ఈ పథకం టెన్యూర్ 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 7.4 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.90 శాతం వడ్డీని ఎస్‌బీఐ అందిస్తోంది. ఈ సర్వోత్తం ఎఫ్‌డీ పథకంపై ఎస్‌బీఐ 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ. ఇది కాకుండా ఈ పథకం అతిపెద్ద ఫీచర్ ఏంటంటే.. దాని కాలవ్యవధి. ఈ పథకం టెన్యూర్ 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 7.4 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.90 శాతం వడ్డీని ఎస్‌బీఐ అందిస్తోంది.
* తాజాగా ఓ ఇంటర్వ్యలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సైరా సినిమా నష్టాలు మిగిల్చినట్లు అంగీకరించారు. ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ‘సైరా’ గురించి చిరంజీవి ఇలా వ్యాఖ్యానించారు. ‘ ఇన్నేళ్ల నా సినిమా జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను, చాలా సినిమాల్లో నటించాను. కానీ వాటిలో కొన్ని సంతృప్తి ఇవ్వలేదు. పలాన పాత్ర చేయాలని ఎదురు చూస్తే ప్రతిసారీ మనకు రావు. ఈ క్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలనే కోరిక నాలో చాలా ఏళ్లుగా ఉండేది. ఫైనల్లీ ‘సైరా’తో అది తీరిపోయింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z