పోల్‌వాల్ట్‌లో అనితర సాధ్యమైన రికార్డులు నెలకొల్పాడు ఉక్రెయిన్ స్టార్ సెర్గీ బుబ్కా. అవి ఏళ్ల తరబడి నిలిచి ఉన్నాయి. అలా 26 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఓ రికార్డును స్వీడన్ అథ్లెట్ ఆర్మండ్ డుప్లాంటిస్ బద్దలు కొట్టాడు. రోమ్‌లో జరుగుతున్న గోల్డెన్ గాలా అథ్లెటిక్ మీట్లో పురుషుల పోల్‌వాల్ట్ ఔట్‌డోర్ పోటీల్లో రెండో ప్రయత్నంలో 6 మీటర్ల 15 సెంటీమీటర్లు ఎగిరిన ఈ స్వీడన్ స్టార్.. 1994లో బుబ్కా (6.14 మీటర్లు) నెలకొల్పిన రికార్డును దాటేశాడు. ఈ ఫిబ్రవరిలో గ్లాస్గోలో జరిగిన అథ్లెటిక్స్ మీట్లో డుప్లాంటిస్ ఇండోర్ ప్రపంచ రికార్డు (6.18 మీటర్లు)ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ‘‘ఎట్టకేలకు ఔట్‌డోర్ ప్రపంచ రికార్డు నెలకొల్పా. 6.15 మీటర్లు దూకాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈ ఘనత సాధించిన తర్వాత ఎంతో సంతోషంగానే కాదు భారం తీరినట్టు ఉంది’’ అని 20 ఏళ్ల డుప్లాంటిస్ చెప్పాడు. వయసు విభాగాల టోర్నీల్లోనూ రికార్డులు సృష్టించిన డుప్లాంటిస్.. పెరిగింది అమెరికాలో అయినా, తాను పుట్టిన స్వీడన్ తరఫున పోటీ పడుతున్నాడు.
రికార్డులు బద్ధలు
Related tags :