Politics

2019 ఎన్నికల్లో ఈసీకి దొరికింది ₹3439 కోట్లు

Indian Election Commission Seizes 3439 crore rupees into 2019 elections - tnilive - indian black money in elections

ఎన్నికల వేళ ధన ప్రవాహం.. ఇప్పటి వరకూ రూ.3439 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈసీ. సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ధన ప్రవాహం కొనసాగింది. ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న డబ్బు వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రూ. 1200 కోట్లు పట్టుబడగా…ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా రూ. 3439 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో రూ. 950 కోట్లు తమిళనాడులోనే పట్టుబడినట్లు ఈసీ వెల్లడించింది. అత్యధిక డబ్బు సీజ్ చేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. రూ. 552 కోట్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచినట్లు ఈసీ పేర్కొంది. అంతేకాకుండా కోడ్ ఉల్లంఘనకు సంబంధించి దేశ వ్యాప్తంగా 500 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం వివరించింది.