Movies

సంగీత రిటర్న్స్

Heroine Sangeetha Second Innings To Begin Soon

`ఖ‌డ్గం`, `శివ‌పుత్రుడు`, `ఖుషీ ఖుషీగా`, `పెళ్ళాం ఊరెళితే`, `సంక్రాంతి` వంటి ప‌లు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు సంగీత. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన సంగీత పెళ్లి త‌ర్వాత తెలుగు సినిమాల‌కు దూరంగా ఉండిపోయారు. అడ‌పా ద‌డ‌పా తమిళ చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే ఈమె త్వ‌ర‌లోనే తెలుగు వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నార‌ట‌. మ‌హేశ్ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఉండే ఓ కీల‌క పాత్ర‌లో సంగీత న‌టించ‌బోతున్నార‌ట‌. ఇది సంగీతకు మంచి క‌మ్ బ్యాక్ మూవీ అవుతుందంటున్నాయి సినీ వ‌ర్గాలు. ఈ సినిమాలో సంగీత‌తో పాటు విజ‌యశాంతి, బండ్ల గ‌ణేశ్ కూడా రీ ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.