Business

ఒరిస్సా రసగుల్లకు నాణ్యత చిహ్నం

Orissa Rasagulla Gets GI Tag By Indian Government - ఒరిస్సా రసగుల్లకు నాణ్యత చిహ్నం

రసగుల్లా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ తీపి వస్తువు కోసం జరిగిన పోరాటంలో గతంలో పశ్చిమబెంగాల్‌ భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) దక్కించుకోగా.. ఒడిశా సైతం ఈ ట్యాగ్‌ను పొందింది. ‘ఒడిశా రసగొలా’గా దీనికి చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. 2028 ఫిబ్రవరి 22 వరకు ఈ ట్యాగ్‌ చెల్లుబాటు కానుంది. నాణ్యత, పేరుప్రఖ్యాతలు ఉన్న ఆయా వస్తువులను వాటి మూలాలను బట్టి ఆయా ప్రాంతాలకు చెందినవని నిర్ధారిస్తూ జీఐ చిహ్నాలను మంజూరు చేస్తుంటారు. జీఐ పొందే క్రమంలో ఆ వస్తువు మూలాలు కచ్చితంగా ఆ ప్రాంతలోనే ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుంది. వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌లో సభ్యదేశమైన భారత్‌లో 2003 నుంచి ఈ చిహ్నాలను ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో రసగుల్లా మాదేనంటూ 2015 నుంచి బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. చివరికి ఈ పోటీలో ఒడిశాపై బెంగాల్‌ పైచేయి సాధించింది. 2017 నవంబర్‌లో అంతర్జాతీయ గుర్తింపును పొందింది. అప్పట్లో పశ్చిమ బెంగాల్‌ రసగుల్లాకు ‘బంగ్లార్‌ రసగుల్లా’గా జీఐ ట్యాగ్‌ను జారీ చేశారు.