Movies

నేను నమ్మను. ₹10కోట్లు నాకొద్దు.

నేను నమ్మను. ₹10కోట్లు నాకొద్దు.-Shilpa Shetty Rejects 10Crores Offer For Ayurvedic Pills

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. 13 ఏళ్ల పాటు తెరకు దూరమైనా యోగా వీడియోలు చేస్తూ బిజీగా గడిపారు. ఇప్పుడు ఇదే ఫిట్‌నెస్‌కు సంబంధించి ఓ కంపెనీ ఆమెకు ఓ ఆఫర్‌ ఇచ్చింది. ప్రముఖ ఆయుర్వేద కంపెనీ స్లిమ్మింగ్‌ పిల్స్‌(సన్నబడటానికి వాడే మాత్రలు)కు ప్రచారకర్తగా వ్యవహరించాలని అందుకు గానూ రూ.10 కోట్లు ఇస్తామని సదరు కంపెనీ చెప్పింది. అందుకు శిల్ప అంగీకరించలేదు. తాను నమ్మని విషయాలను ప్రజలకు చెప్పలేనని కరాఖండిగా చెప్పేసింది.