DailyDose

Yes బ్యాంకుకు ఊరట-వాణిజ్యం-03/10

Yes Bank Gets Relief - Telugu Daily Business News Today - 10/03

* ప్రమోటర్ రాణాకపూర్ తదితరులు 2.16 శాతం వాటాను విక్రయించడంతో బ్యాంకులో వాటా 4.72 శాతానికి పరిమితమైన్దట్లు ఎస్ బ్యాంకు ఇప్పటికే తెలిపింది. రాణా కపూర్ తనఖా పెట్టిన పదికోట్ల షేర్లను ఉద్దేశపూర్వకంగా విక్రయించడం వల్లే షేర్లు భారీ పతనాన్ని చవిచూసినట్లు ఎస్ బ్యాంకు తెలిపింది. ఇప్పటికే తమ బ్యాంకు ఫైనాన్షియల్ ఫండమెంతల్స్ బలంగానే ఉన్నాయని చెప్పుకొచ్చింది.
* ఐటీ నోటీసుల ప్రక్రియను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేసింది. కంప్యూటర్‌ ద్వారా జనరేట్‌ చేసే ఈ నోటీసులపై డాక్యుమెంట్‌ గుర్తింపు సంఖ్య (డిన్‌) లేకపోతే ఆ నోటీసులు చెల్లవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు.
* దేశ స్థిరాస్తి రంగం (రియల్టీ) స్వరూపం మారుతోందని హెచ్‌డీఎ్‌ఫసీ చైర్మన్‌, ప్రముఖ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ అంటున్నారు. స్టూడెంట్‌ హౌసింగ్‌, రిటైర్మెంట్‌ హోమ్స్‌, కో-లివింగ్‌ ప్రాజెక్టుల రూపంలో ఈ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు. మార్కెట్‌ అవసరాలను ముందే గ్రహించి సరైన ధర, సరైన సైజు ప్రాజెక్టులు చేపట్టే ‘సరైన డెవలపర్లు’ ఉన్నంత వరకు దేశ రియల్టీ రంగ అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు.
* ఒకవైపు కార్పొరేట్‌ పన్ను కోతతో తగ్గనున్న ఆదాయం… మరోవైపు నిరాశాజనక జీఎ్‌సటీ వసూళ్లు. ఈ నేపథ్యంలో ఖజానా నింపగలిగే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఆయా రంగాల్లోని తన ఆస్తుల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల వరకు సమకూర్చుకునేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించుకుంది. విమాన రంగంలో రూ.15,000 కోట్లు, విద్యుత్‌ రంగంలో రూ.20,000 కోట్లు, ఓడ రవాణా రంగంలో రూ.7,500 కోట్లు, జాతీయ రహదారుల రంగంలో రూ.25,000 కోట్లు, రైల్వే రంగానికి చెందిన మరో రూ.22,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాలని అనుకుంటోంది.
* ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను రేట్లలో భారీ కోత వ్యవస్థాత్మక సంస్కరణలకు సంకేతమని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ అన్నారు.  నుంచి  ఏళ్ల మధ్య కాలంలో భారత్‌ వ్యవస్థాత్మక సంస్కరణలేవీ చేపట్టలేదని అందువల్ల ప్రభుత్వం వ్యవస్థాత్మక సంస్కరణల అమలుపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు
* పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంక్‌(పీఎంసీ)లో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలపై బ్యాంక్‌ మాజీ ఎండీ జాయ్‌ థామస్‌ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఆడిటర్లు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించక పోవడమే బ్యాంకు ప్రస్తుత సంక్షోభానికి కారణమని ఆర్‌బీఐకి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.  నుంచి బ్యాంక్‌ ఆడిటర్లుగా వ్యవహరించిన మూడు సంస్థలు పైపై ఆడిటింగ్‌తో సరిపెట్టడం వల్లే బ్యాంకులో చోటు చేసుకున్న అవకతవకలు బయటకు రాలేదన్నారు.
* ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ర్టిక్‌ వాహనాల (ఈవీ) మార్కెట్లలో ఒకటిగా మారే సత్తా భారత్‌కు ఉందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌)ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్‌ నివేదిక వెల్లడించింది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకేకాకుండాముడిచమురు దిగుమతులను తగ్గించుకునేందుకుగాను విద్యుత్‌ వాహనాల వినియోగం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. అయితే ఈ వాహనాల కొనుగోలు వ్యయం అధికంగా ఉంటున్న కారణంగా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని తెలిపింది.
* ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీఅతని భార్య మినాల్‌ మోదీకి స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న నల్ల ధన ఖాతాలపైనా భారత్‌ దృష్టి పెట్టింది. వీరిద్దరికి సంబంధించి బ్యాంకుల్లో ఉన్న ఖాతాల వివరాలు అందజేయాలని స్విట్జర్లాండ్‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో ఈ సమాచారం భారత్‌కు అందజేయడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటేఅధీకృత వ్యక్తుల ద్వారా రోజుల్లో తెలపాలని స్విట్జర్లాండ్‌ ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) మోదీ దంపతులకు నోటీసులు జారీ చేసింది.