Business

భారత రైల్వేతో అమెజాన్ ఒప్పందం

Amazon Signs Contract With Indian Railway

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా భారతీయ రైల్వేతో ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ నగరాల మధ్య ఈ-కామర్స్‌ ప్యాకేజీలను తరలించేందుకు రైల్వే సేవలను వినియోగించుకోనున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగాత్మకంగా తొలుత న్యూదిల్లీ- ముంబయి, ముంబయి-న్యూదిల్లీ, న్యూదిల్లీ- కోల్‌కతా రూట్లలో వినియోగదారులకు చెందిన ఈ కామర్స్‌ప్యాకేజీలను తరలించేందుకు ఒప్పందం కుదర్చుకున్నట్లు అమెజాన్‌ పేర్కొంది. ఈ-కామర్స్‌కు చెందిన సరకు రవాణాకు ఇలా రైల్వే సేవలను వినియోగించుకోవడం ఇదే ప్రథమమని అమెజాన్‌ తెలిపింది. రైల్వేలో సరకు రవాణా ద్వారా ప్యాకేజీలను త్వరితగతిన వినియోగదారులకు చేరవేయడంతో పాటు, వినియోగదారుల్లో విశ్వసనీయత పెంచేందుకు దోహద పడుతుందని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (మిడిల్‌ మైల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌) అభినవ్‌ సింగ్‌ తెలిపారు. రైల్వేతో దీర్ఘకాలం పాటు ఈ భాగస్వామ్యం కొనసాగించాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.