Videos

పనికిమాలిన…అసంభవమైన…అసంబద్ధమైన సమ్మె ఇది

KCR Calls TSRTC Strike A Foolish Stunt Before Union Elections-యూనియన్లు చేసేది మహానేరం...మహామోసం

ఆర్టీసీ సంఘాలపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. పనికిమాలిన ఈ సంఘాలవల్లే ఇవాళ ఆర్టీసీ నాశనమయింది. ఆర్టీసీ కార్మికులు ఆమాయకులు. యూనియన్ల ఉచ్చులో పడి తమకు అన్నం పెడుతున్న సంస్థను నాశనం చేసుకున్నారు. తాము కూర్చున్న కొమ్మను తమ చేతులతోనే నరుక్కున్నారు. ఆర్టీసీ సమ్మె వందకు వందశాతం ఇల్లీగల్‌. అర్థం పర్థం లేని, అనాలోచితమైన, బాధ్యతారాహితమైన నిర్ణయం ఈ సమ్మె అన్నారు.పనిపాట లేని యూనియన్‌ లీడర్లు వారి స్వార్థం కోసం కార్మికుల వీక్‌నెస్‌ను వాడుకుంటున్నారు. వారిని రెచ్చగొట్టి యూనియన్‌ ఎలక్షన్ల కోసం ప్రతిసారి ఎన్నికలకు ముందు సమ్మెకు పోవడం ప్రతీ ప్రభుత్వంలో జరిగే తంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మెకు వెళ్లడమనేది పెద్ద తప్పు. ఈ నాలుగేళ్లలో 67 శాతం కార్మికుల జీతాలు పెంచినం. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయనంత సహాయం ఆర్టీసీకి చేశాము. 4 వేల 5 వందల కోట్లకు పైగా ఆర్టీసీకి ఇచ్చాము. ఆర్టీసీలో ఏం జరుగుతున్నదో నాకు తెలుసు. గతంలో నేను ఆర్టీసీ మంత్రిగా ఉన్నపుడు ఆహోరాత్రులు కష్టపడి ఆర్టీసీని నష్టాల్లోనుంచి గట్టెక్కించానన్నారు.

చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ మనుగడలో లేదు. సుమారు 30 ఏండ్లకు పైగా వామపక్షాల పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్లోనే ఆర్టీసీ సచ్చిపోయింది. 10 కోట్ల మంది జనాబా ఉన్న బెంగాల్‌ కేవలం 200 బస్సులు ఆర్టీసి నడుపుతున్నది. లాభాలు వచ్చే పీక్‌ టైం.. పండుగ సీజన్‌లో సమ్మెకు పోయారు. ఇంతకంటే పిచ్చితనం ఉంటదా?. రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు కొన్ని వేలు నడుస్తున్నాయి. వాటికి లాభాలు ఎట్లొస్తయి..ఆర్టీసీకి ఎట్ల రావు. ఇదే ఆర్టీసీలో నడిసే అద్దె బస్సులకు లాభాలొస్తున్నాయి. మరి ఆర్టీసీ బస్సులు ఎలా నష్టాల్లో నడుస్తున్నాయి. ఇదంతా స్వయం కృపారాదం అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఇదే యూనియన్ల వల్ల కొల్‌కతా డెత్‌ సిటీగా మారింది. మొన్నటివరకు కోల్‌కతాలో బిల్డింగులకు సున్నమేసుకున్నా యూనియన్లు చందాలు వసూలు చేశారన్నారు. ఆ భయానికి అక్కడ ఇండ్లకు పేయింట్‌ వేసుకోవడమే మానేశారు. మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత పేయింట్‌ వేసుకున్న బిల్డింగులకు ట్యాక్స్‌ మాఫీ చేస్తామని ఆఫర్‌ ఇవ్వడంతో పరిస్థితి మారిందన్నారు.
https://www.facebook.com/ETVBharatTelangana/videos/425086131542455/?t=0