ScienceAndTech

వాట్సాప్ యాండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త భద్రత

WhatsApp Android Users Gets New Fingerprint Unlocking Feature-వాట్సాప్ యాండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త భద్రత

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్లకు ఓ నూతన ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ యాప్‌కు ఇకపై యూజర్లు ఫింగర్‌ప్రింట్‌తో లాక్ పెట్టుకోవచ్చు. దీంతో యూజర్లు తమ ఫింగర్‌ప్రింట్‌తో ఓపెన్ చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది.

ఈ క్రమంలో యూజర్ల వాట్సాప్ అకౌంట్‌కు మరింత సెక్యూరిటీ ఉంటుంది.

ఇతరులు ఫోన్‌ను తీసుకున్నా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయలేరు.

అయితే ఈ ఫీచర్ ఇప్పటికే ఐఫోన్లలో లభిస్తుండగా, దీన్ని ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు కూడా పొందవచ్చు.

వాట్సాప్‌ను నూతన వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందవచ్చు.