Politics

ఇంగ్లీషుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది

AP CM YS Jagan Says English Will Yield Better Future To Students

ప్రపంచంతో పోటీపడే స్థాయికి పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను సోమవారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న డిప్యూటీ సిఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జయంతి సందర్భంగా.. జాతీయ విద్యాదినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజునే అభివఅద్ధి సాధ్యమని, తమ ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘విద్యాశాఖ, మైనారిటీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యాభివఅద్ధితోనే సమానత్వం వస్తుందని అంబేద్కర్‌ చెప్పారని.. ఆయన స్పూర్తి తో సిఎం జగన్‌ అందరికీ విద్యను అందేలా కఅషి చేస్తున్నారని తెలిపారు. మైనారిటీలకు మంచి విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని.. కార్పొరేట్‌ విద్యా సంస్థల కు పోటీగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని జగన్‌ నిర్ణయించారని పేర్కొన్నారు. ఎపి సిఎం జగన్‌ మాట్లాడుతూ.. అబుల్‌ కలాం జయంతిని 2008 లో మైనార్టీ వెల్ఫేర్‌ డే గా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారికంగా నిర్వహించారని గుర్తు చేశారు. విద్యాసంస్థల అభివఅద్ధి కోసం అబుల్‌ కలాం ఆజాద్‌ చేసిన కఅషి ఎనలేనిదన్నారు. 1947 నుంచి 1958 వరకు మౌలానా విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలు అందిచారని కొనియాడారు. అనేక విద్యా సంస్థలను పునాది వేసినట్లు చెప్పుకొచ్చారు. పేదరికం నుంచి బయటపడాలి అంటే చదువు చాలా ముఖ్యమని, తమ ప్రభుత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పేదరికంను, వెనుకబాటును అతి దగ్గరగా చూశానన్నారు. దీనంతటికీ కారణం పిల్లలకు నాణ్యమైన విద్యలేకపోవడమేనని చెప్పారు. ‘2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతం. దేశంలో 27 శాతంగా ఉందని, దేశ సరాసరి కంటే చాలా వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఈ దారిద్యం పోవాలంటే పిల్లలకి ఉన్నత విద్యను అందించాలన్నారు. ఒక దీపం గదికి వెలుగునిస్తే.. చదువుల దీపం కుటుంబానికి, దేశానికి వెలుగునిస్తుందని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి పిల్లలు ఎదగాలని.. అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇటీవల ఓ జీవో ను విడుదల కూడా చేసిందని, కార్యాచరణ కూడా రూపొందించిందని తెలిపారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీనటుడు పవన్‌కల్యాన్‌ వంటి వారు చాలా దారుణంగా మాట్లాడారని, పేదవాడికి ఇంగ్లీషు మీడియం ఎందుకని చులకన చేశారని చెప్పారు. ఈ సందర్భంగా వారందరికి జగన్‌ సవాలు విసురుతూ.. ” చంద్రబాబు కుమారుడు, మనవడు ఏ మీడియంలో చదువుతున్నారు. పవన్‌ కల్యాన్‌ కుమారులు ఏ మీడియంలో చదువుతున్నారు..” అని ప్రశ్నించారు. పిల్లలకు మంచి చదవులు ఇవ్వకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని, పిల్లలకి ఉన్నత చదవులు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని దానిపై ప్రతిపక్ష నాయకులు బుదరజల్లడం నిజంగా దారుణమని అన్నారు. ముందుగా.. నాడు నేడు కార్యక్రమంలో 15 వేల పాఠశాలలను ఆధునీకరిస్తామని సిఎం తెలిపారు. ఇంగ్లీషు మీడియంను అమలు చేస్తామన్నారు. అన్ని వసతులను కల్పిస్తామన్నారు. వాటిల్లో ఇంగ్లీషు ల్యాబులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంగ్లీషు మీడియంను అమలు చేస్తూనే.. తెలుగును సబ్జెట్‌గా గుర్తిస్తామని తెలిపారు. ముందుగా ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు అమలు చేస్తామన్నారు. ఆ తరువాత ఒక్కో తరగతి పెంచుతూపోతామని తెలిపారు. పాఠశాల విద్యతో ప్రారంభమైన ఈ విప్లవాత్మక మార్పులు.. ఉన్నత విద్యలోనూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. చదువే పిల్లలకు ఇచ్చే ఆస్తి అని, మదార్సా పాఠశాలల గురించి మంత్రులు నాక ఇప్పుడు గుర్తుచేశారని అన్నారు. ఈ సందర్భంగా మదార్సా బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని సిఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎం జగన్‌తోపాటు మంత్రులు పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి, వెల్లపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్‌, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పాల్గన్నారు.