NRI-NRT

సూర్యాపేట జిల్లాలో 120మందికి ఆటా ద్వారా ఉద్యోగవకాశాలు

120 Unemployed Youth Finds Job Via ATA Vedukalu 2019 In Suryapeta Dt-సూర్యాపేట జిల్లాలో 120మందికి ఆటా ద్వారా ఉద్యోగవకాశాలు

2019 అమెరికా తెలుగు సంఘం (ఆటా) వేడుకల్లో భాగంగా గురువారం నాడు సూర్యాపేట జిల్లాలో ఉద్యోగ మేళా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల ఛైర్మన్ భువనేశ్‌ బుజాలా, ఆటా ప్రతినిధులు అనిల్‌ బోదిరెడ్డి, రామకష్ణా రెడ్డి అలా, నర్సింహా రెడ్డి ద్యాసాని, కిషోర్‌ గూడూరు, మోతి మండల ఎంపీపీ ఉషా తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు సరైన శిక్షణ ఇస్తే వారు మంచి ఉద్యోగాలు సాధిస్తారనే ఆశాభ్వాంతో ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని భువనేశ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా నుండి తొలుత ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, అందరి సహకారంతో ఇది విజయవంతం అవుతుందని అన్నారు. ఉద్యోగ మేళాలో బిజినెస్‌ డెవలప్‌ మెంట్‌, బిపివో సిసిఇ, ఆటోమొబైల్స్‌ సేల్స్‌ ఎగ్జిక్యుటివ్స్‌, హాస్పిటాలీటీ ఫుడ్‌ అండ్‌ బెవరెజ్‌ స్టెవర్డ్‌, రిటైల్‌ సెల్స్‌ అసోసియేట్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, క్వీక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన 120 మందికి 12 వారాల శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పిస్తారు.