DailyDose

హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు వాయిదా-నేరవార్తలు

Verdict Postponed In Hazipur Rape Murder Case-Telugu Crime News

*శ్రీనివాస్‌ రెడ్డి కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న నల్లగొండ ఫాస్ట్‌ కోర్టు… ఇవాళ తుది తీర్పును వెలువరిస్తుందని భావించారు. అయితే తీర్పు ప్రతులు వెలువడాల్సి ఉంది. అందుకే ఫిబ్రవరి 6కు తీర్పును వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6 వాయిదా పడింది.శ్రావణి, మనీషా, కల్పన ల హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న నల్లగొండ ఫాస్ట్‌ కోర్టు… ఇవాళ తుది తీర్పును వెలువరిస్తుందని భావించారు. అయితే తీర్పు ప్రతులు వెలువడాల్సి ఉంది. అందుకే ఫిబ్రవరి 6కు తీర్పును వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. సమత అత్యాచారం కేసులో కూడా ఇవాళే తుది తీర్పు రానుంది. నవంబర్ 24 , 2019న తేదిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించి ముగ్గురు వ్యక్తులు అపహరించారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారం హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను తీవ్రంగా పరిగణించిన పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. డిసెంబర్ 14న ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు.
*కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో ఇవాళ(సోమవారం) తీర్పు రావాల్సి ఉంది. అయితే అది వాయిదా పడింది. జడ్జీ అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారని… దీంతో తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత హత్యాచారం జరిగింది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ఆమెను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక హత్యాచారం చేసి హత్య చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఇప్పటికే విచారణ పూర్తయింది.
* మిళనాడులోని మధురైలో ఘోరప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్‌ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
*అఫ్గాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఘజ్ని ప్రావిన్స్‌ లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. ‘అరియానా అఫ్గాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం ఘజ్ని ప్రావిన్స్‌లోని సడో ఖేల్‌ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు’ అని ఘజ్ని గవర్నర్‌ కార్యాలయ అధికార ప్రతినిధి అరిఫ్‌ నూరి తెలిపారు.
*సోమవారం ఉదయం చెన్నై నుంచి మైసూరుకు బయలుదేరిన ట్రూజెట్‌ విమానం, టేకాఫ్‌ తీసుకున్న కాసేపటికే, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గమనించిన పైలెట్‌, విషయాన్ని గ్రౌండ్‌ స్టాఫ్‌ కు తెలపడంతో అత్యవసరంగా విమానం దిగేందుకు అనుమతిచ్చారు. ఇదే విమానంలో సౌతిండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సహా 48 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్‌ గా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సమస్యను సరిచేసే పనిలో ఇంజనీర్లు నిమగమయ్యారు. ఈ సమస్య ఎందుకు వచ్చిందన్న విషయాన్ని విచారిస్తున్నామని ట్రూజెట్‌ ఓ ప్రకటనలో తెలిపింది.
*చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. ప్రపంచదేశాలకూ విస్తరిస్తోంది. ఈ వైరస్ బారినపడి మృతిచెందిన వారి సంఖ్య తాజాగా 80కి చేరింది. మరో 2,744 మందిలో వైరస్‌ ఆనవాళ్లు గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత 24 గంటల్లోనే 24 మంది మరణించడం… 461 కొత్త కేసులు నమోదవడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. మరో 3,806 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
*బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రయింట్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో హెలికాప్టర్‌ కూలిన ఘటనలో కోబ్‌ బ్రయింట్, ఆయన కుమార్తె (13) జియానాతో సహా 9 మంది మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న సికోర్సికీ ఎస్ 76 హెలికాఫ్టర్‌ లాస్‌ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఉన్న ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు బయలుదేరిన హెలికాప్టర్‌ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కొండను ఢీ కొట్టి కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న అందరూ కన్నుమూశారు. ప్రమాదం మారుమూల ప్రాంతంలో జరగడం, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలను వెలికితీయడానికి రోజుల సమయం పట్టే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
*చైనాలో మొదలైన కరోనా వైరస్‌ కలకలం ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వ్యాధిగ్రస్థులను నిర్ధారించకపోయినా.. చైనా, హాంగ్‌కాంగ్‌ తదితర దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా.. ముందస్తుగా వైద్యులను సంప్రదిస్తున్నారు. బుధవారం(22న) చైనా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక యువ వైద్యుడు జలుబు, దగ్గు లక్షణాలతో ఫీవర్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
*పోలీస్ఇన్ఫార్మర్నుదుండగులుచాకుతోపొడిచిదారుణంగాహత్యచేశారుబసవేశ్వరనగర్లోనికమలానగర్లోహత్యజరిగింది
* ఆ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులు.. అవినీతి, అక్రమాలకు ఆమడదూరంలో ఉండాల్సిన వారు ఒక ముఠాగా జట్టుకట్టారు. అనంతరం నిరుద్యోగులు, డబ్బున్న వ్యక్తులను ఎంపిక చేసుకొని ఉద్యోగాలు, భూములు ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారు. ఈ ఘరానా మోసం గుట్టురట్టవడంతో చివరకు కటకటాల పాలయ్యారు.
*భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు యూపీ నుంచి ఆయన వచ్చారు. సాయంత్రం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సభలోనూ పాల్గొనాల్సి ఉంది.
*గ్రామస్థుల దాడిలో ఓ మావోయిస్టు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా పాపర్మెట్లా ఠాణా పరిధిలోని జంతురాయి గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను మల్కాన్గిరి ఎస్పీ హృషికేష్ డి.ఖిలారి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
*కర్ణాటక రాష్ట్రం ధార్వాడ నగరానికి సమీపంలోని జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను కుందగోళకు చెందిన శివానంద మఠాధిపతి బసవేశ్వరస్వామి, శంకరగౌడ పాటిల్ (కుందగోళ), మహదేవ (కబ్బూరు), మారుతి కుకనూరుగా (చిక్కోడి) గుర్తించారు. వీరందరూ ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. ఆదివారం ధార్వాడలో భక్తుడి వివాహానికి హాజరయ్యేందుకు బసవేశ్వరస్వామి కారులో వస్తుండగా మరో కారు వేగంగా వచ్చి ఢీకొంది.
*ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పరిధి మర్కినార్-పుస్గురి రహదారిలో ఉన్న రెండు డోజర్ ట్రాక్టర్లతోపాటు మరో ట్రాక్టరును మావోయిస్టులు దహనం చేశారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పీఎంజీఎస్వై పథకం కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు వినియోగించే ఈ వాహనాలు సమీపంలో పాఠశాల వద్ద ఉంచారు. గణతంత్ర దినోత్సవ బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఈ చర్యలకు పాల్పడ్డారు. అక్కడే గోడ పత్రాలను వదిలారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ ఘటన జరగడంతో పెద్దఎత్తున పోలీసు బలగాలు మావోయిస్టుల గాలింపునకు కదిలి వెళ్లాయి.
*కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఆడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప సాగర్ కాలనీకి చెందిన గౌస్ పీర్ (9), ఖాజా (5), మౌలా(7) అనే ముగ్గురు చిన్నారులు ఆదివారం సాయంత్రం సరదాగా ఆడుకునేందుకు సమీపంలోని బుడ్డాయపల్లె చెరువు వద్దకు వెళ్లారు. చెరువులోకి దిగి ఆడుకుంటుండగా అందులో ఉన్న నీటి కుంటల్లో ఇరుక్కుపోయారు.
*వివాహితపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో శనివారం వెలుగులోకి వచ్చింది.
*హిందీలో ప్రసారమయ్యే ‘దిల్ తో హ్యాపీ హై జీ’ ధారావాహికలో నటించి సిమ్మి ఖోస్లాగా గుర్తింపు తెచ్చుకున్న నటి సెజల్ శర్మ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. థానే జిల్లాలోని తన నివాసంలో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో సెజల్ పేర్కొందని పోలీసులు వెల్లడించారు.
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం జాతీయ రహదారిపై ఇస్కో కిసాన్ సెజ్ వద్ద అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
*డ్రైవర్ను కొట్టి, కంటెయినర్ లారీని అపహరించి అందులో ఉన్న సుమారు రూ.3.5 కోట్ల విలువైన సిగరెట్లను దోచుకెళ్లిన ఘటనిది. ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్లను కంటెయినర్ లారీ ద్వారా బెంగళూరు నుంచి విజయవాడకు తరలిస్తుండగా ప్రకాశం జిల్లా గుడ్లూరు-సింగరాయకొండ మధ్యలోని జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఈ దోపిడీ జరిగింది.
*పబ్జీ ఆటకు పదో తరగతి విద్యార్థి బలయ్యాడు. కృష్ణా జిల్లా శ్రీకాకుళం బీసీ కాలనీకి చెందిన రైతు తమ్మనబోయిన భీమరాజు – విద్యానాగిని దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీపక్ సాయి (15) పదో తరగతి, రెండో కుమారుడు కల్యాణ్ 8వ తరగతి చదువుతున్నారు. దీపక్ సాయిని ట్యూషన్లో చేర్పించారు.
*తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్రెడ్కో)లో భారీ అక్రమాలు సీఐడీ దర్యాప్తులో బహిర్గతమయ్యాయి. కేంద్రప్రభుత్వం అధీనంలోని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ జారీ చేసిన రూ.కోట్ల రాయితీలను కొట్టేసిన కుంభకోణం వెలుగుచూసింది.
*తమిళనాడులోని మధురైలో ఘోరప్రమాదం జరిగింది. విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్‌ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. విద్యార్థులను చికిత్స నిమిత్తం మధురై రాజాజి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు.