DailyDose

రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌‌ న్యూస్‌‌-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Central Govt Gives Good News

*రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌‌టీ కాంపెన్సేషన్‌‌లో భాగంగా రూ. 35 వేల కోట్లను త్వరలో చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. జీఎస్‌‌టీ రాకతో రాష్ట్రాలు కోల్పోయే రెవెన్యూ భర్తీకి మొదటి అయిదేళ్లూ కాంపెన్సేషన్‌‌ చెల్లించడానికి కేంద్రం ఒప్పుకున్న విషయం తెలిసిందే. బేస్‌‌ ఇయర్‌‌ 2, గత రెండు ఆర్థిక సంవత్సరాలతోపాటు, ఈ ఆర్థిక సంవత్సరపు తొలి నాలుగు నెలల్లో కాంపెన్సేషన్‌‌ చెల్లింపుపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఎలాంటి తేడాలూ లేవు. ఐతే, కాంపెన్సేషన్‌‌ సెస్‌‌ వసూళ్లు సరిపోకపోవడంతో ఆగస్టు 2019 నుంచీ రాష్ట్రాలకు కాంపెన్సేషన్‌‌ చెల్లింపులలో జాప్యం జరుగుతోంది
* తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆదివారం వర్షాలు పడ్డాయి. దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. రాష్ట్రంలో ఆగేయ, తూర్పుదిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
* ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీ ల పెంపు.500 యూనిట్స్ పైన వాడిన వారికి వర్తియంపు.500 యూనిట్స్ పైన వాడిన వారికి యూనిట్ కి 0.90 పైసలు వడ్డన.500 యూనిట్స్ వడిన టారిఫ్ ఇక నుండి రూ 9.05 పైసలు నుండి రూ 9.95 పైసలు గా టారిఫ్.ప్రభుత్వ, కార్పోరేట్ సంస్థల పై పడనున్న భారం.గృహ వినియగదారులపై కూడా పడనున్న పెంపు భారం.
రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల వినియగడారుల్లో 1.30 లక్షల వినియోగ దారుల పై పెంపు భారం…
* విజయవాడ హెల్ప్ హాస్పటల్ కు చేరుకున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.హాస్పటల్ లో చికిత్స పొందుతున్న నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులను పరామర్శించిన చంద్రబాబు నాయుడు.హాస్పటల్ వద్ద జై అమరావతి అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు.
* ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఉద్యోగులకు కామా ప్రమోషన్లపై రిజర్వేషన్లు అవసరం లేదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎస్సీ, ఎస్టీ దళితులు వ్యతిరేకించాలని కోరుతూ. సిపిఎం ఆధ్వర్యంలో పార్వతీపురంలో సోమవారం మానవహారం నిర్వహించారు. పాత బస్టాండ్‌ నుండి ర్యాలీగా వచ్చిన అనంతరం నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారాన్ని చేపట్టారు.
* జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను ప్రజా భద్రత చట్టం(పీఎస్‌ఏ) కింద నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్‌ సుప్రీం కోర్టు ఆశ్రయించారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలన్న ఆమె అభ్యర్థనను సోమవారం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అరెస్టు వల్ల అబ్దుల్లా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ అబ్దుల్లా అరెస్టును సవాల్‌ చేస్తూ హెబియస్‌ కార్పస్‌ పిటిసన్‌ను దాఖలు చేశామని వెల్లడించారు. ఈ వారంలో దీనిపై విచారణ జరపాలని కోరామన్నారు.
*ఏపీ రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన రైతు కంచర్ల చంద్రం(43) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. చంద్రం రాజధాని కోసం 31 సెంట్ల భూమి ఇచ్చారు. రాజధాని ఉద్యమంలో చంద్రం చురుగ్గా పాల్గొన్నారు. రాజధాని తరలిపోతోందని పదే పదే ఆలోచించి తల నరాలు దెబ్బ తిని చంద్రం చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
*అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన పలు పంటలు నేలపాలయ్యాయి. మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో అన్నదాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కుంటున్నారు. పలు చోట్ల పత్తి పొలంలో నీరు చేరి కోయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో వందల ఎకరాల్లో పత్తి వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి లబోదిబోమంటున్నారు. అటు ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
*ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.
*కరోనా వైరస్ ప్రబలిన చైనా దేశానికి డాక్టర్ బ్రూసీ ఐల్ వార్డ్ నేతృత్వంలో వైద్యనిపుణుల బృందాన్ని పంపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనావైరస్ నివారణకు చర్యలు తీసుకునేందుకు డాక్టర్ బ్రూసీ ఐల్ వార్డ్ ఆధ్వర్యంలోని వైద్యనిపుణుల బృందాన్ని విమానాశ్రయంలో వదిలినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గీబ్రీయేసుస్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చైనా దేశంలో వచ్చిన కరోనావైరస్ 25 దేశాలకు ప్రబలింది
*తెలంగాణలో అతిపెద్ద సంఘంగా ఉపాధ్యాయ సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థ ప్రమాణాల పెంపుదలకు కృషి చేస్తూ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు.
*రాజకీయాల్లో రాణించడానికి స్థానిక సంస్థలను తొలి అభ్యాస కేంద్రాలుగా భావించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీధర్ సుంకుర్వార్ సూచించారు. ఇటీవల పురపాలక సంఘం ఎన్నికల్లో గెలుపొందిన పద్మశాలి సామాజిక వర్గం ప్రజాప్రతినిధులకు ఆదివారం సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
*పది రూపాయల నాణెం చెల్లుబాటవుతుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ (తెలంగాణ, ఏపీ) సంచాలకులు శుభ్రతదాస్ స్పష్టం చేశారు. ఈ నాణెం చెల్లుబాటు కావడంలేదంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన తెలిపారు. ఆర్బీఐ నిర్వహిస్తున్న ‘ఫైనాన్షియల్ లిటరసీ వీక్’లో భాగంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 5కే పరుగు జరిగింది. సంజీవయ్య పార్కు సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు.
*ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) టారిఫ్ను రూ.50 పెంచింది. ప్రస్తుతం రూ.149 కనీస టారిఫ్ను సంస్థ వసూలు చేస్తోంది. ఎల్వోటీ బాక్సు కోసం రూ.50, జీఎస్టీ కలిపి వినియోగదారుని నుంచి రూ.235 వంతున వసూలు చేస్తోంది. దీనికి మరో రూ.50 పెంచాలని నిర్ణయించింది. పన్నులతో కలిపి ఒక్కో వినియోగదారుడు సుమారు రూ.300 వంతున నెలవారీ ఛార్జీలను చెల్లించాల్సి వస్తోంది. ఫిబ్రవరి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుందని సంస్థ అధికారులు తెలిపారు.
*తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పి.శ్రీనివాసరావు నివాసంలో ఆదాయపు పన్ను విభాగం అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 6వ తేదీ ఉదయం ప్రారంభమైన తనిఖీలు నాలుగోరోజైన ఆదివారం కూడా జరిగాయి. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. కేంద్ర భద్రతా బలగాల రక్షణతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. వివిధ అంశాలపై శ్రీనివాసరావును ప్రశ్నించినట్లు సమాచారం.
*పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్లు 2021-22 నుంచి ఆర్థిక సంఘం నిధులను పొందటం అంత సులువేంకాదు. అప్పటి నుంచి 15వ ఆర్థిక సంఘం కొన్ని ఆంక్షలను అమల్లోకి తేనుండటమే ఇందుకు కారణం. ఖర్చులకు సంబంధించిన ఆడిట్ నివేదికలను సకాలంలో సమర్పించి తీరాలనేది వీటిలో ప్రధానమైంది. మరోవైపు 50 శాతం నిధులను తాగునీరు, పారిశుద్ధ్యాలకు మాత్రమే ఖర్చుపెట్టాలనే నిబంధననూ తీసుకొచ్చారు. నిధులు పొందడంలో ఇవన్నీ స్థానిక సంస్థలకు సవాల్గా మారనున్నాయి.
*కేంద్రం ఇచ్చిన విద్యుత్తు బస్సుల రాయితీని తెలంగాణ ఆర్టీసీ అందిపుచ్చుకోలేకపోయింది. కేంద్రం నిర్దేశించిన గడువులోగా టెండర్లను పిలవకపోవటంతో కేటాయించిన 325 బస్సులు రాష్ట్రానికి దక్కలేదు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యుత్తు బస్సులకు రాయితీలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
*విలీనం పేరుతో ప్రజా రవాణాశాఖ ఉద్యోగులకు తొలగించిన సౌకర్యాలు పునరుద్ధరించాలని, మరికొన్ని డిమాండ్లతో ఈ నెల 11న అన్ని ఆర్టీసీ డిపోల వద్ద సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పలిశెట్టి దామోదరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
*భాగస్వామ్య పింఛను పథకం (సీపీఎస్) రద్దు, వేతన సవరణ కమిషన్కు బడ్జెట్లో నిధుల కేటాయింపు, బకాయి పడిన నాలుగు డీఏల సాధన కోసం మార్చి 3న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, బహిరంగ సభ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నిర్ణయించింది. యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు షేక్ సాబ్జీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యలపై ఫిబ్రవరి 29 వరకు కార్డు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.