NRI-NRT

కనువిందుగా టాకో సంక్రాంతి వేడుకలు

Ohio Columbus Telugu News-TACO 2020 Sankranthi-కనువిందుగా టాకో సంక్రాంతి వేడుకలు

సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) ఆధ్వర్యంలో శనివారం నాడు వెస్తర్‌విల్ నార్త్ హైస్కూల్ లో సంక్రాంతి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. టాకో అధ్యక్షులు జగన్నాథ్ చలసాని దీప ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. నీలిమ యలమంచలి నాయకత్వంలో 2020 కమిటీ సభ్యులు కాళీ ప్రసాద్ మావులేటి, సుధీర్ కనగాల, అపర్ణ కోనంకి, ఉష శాఖమూరు, శివ చావా, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర్ల, అనిల్ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి, వినోద్ యడ్లపల్లి, సత్య మర్రే, ప్రదీప్ గుంటక, శ్రీదిత్య అట్లూరి, ప్రవీణ్ కుమార్ అంకం, రాజేష్ చెరుకూరి, భాను పొట్లూరి, శ్రీవర్షిణి ముద్దులూరు, తేజశ్వని కంచరపల్లి, ప్రదీప్ చందనం, జయ మేడేది, విక్రమ్ రాచర్ల, కీర్తి కౌశిక్ తరణి, అన్వేష్ పెండ్యాల, ఊహ కాట్రగడ్డ, రమ ప్రత్తిపాటి, చిరంజీవి సమ్మెట తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు. ఈ కార్యక్రమానికి ఓహాయో సుప్రీమ్ కోర్టు అసోసియేట్ జస్టిస్ పాట్రిక్ డివైన్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. వేడుకలో భాగంగా ప్రముఖ దంత వైద్యురాలు అపర్ణ సాదినేనిని ఘనంగా సత్కరించారు. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మహానటి సావిత్రికి నివాళి), సఖి ఫ్యాషన్స్ వారి ఫ్యాషన్ షో, ప్రముఖ టి.వీ నటీమణి, కూచిపూడి నర్తకి జ్యోతి రెడ్డి “శ్రీ శ్రీనివాస కళ్యాణం” కూచిపూడి నాట్యం, వాలెంటైన్ డే స్పెషల్, అరవింద్ మేజిక్ షో, దీపక్ భార్గవ్ హాస్యనాటిక “అల ఆఫీసులో” తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ సింగర్ గాయని గాయకులు హనుమాన్, స్వాతిలు తమ పాటలతో శ్రోతలను అలరించారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా టాకో ఆధ్వర్యంలో పిల్లలకి “మేజిక్ ” పోటీలు మరియు “మహానటి సావిత్రి” నటనను అనుకరించుటకు “టిక్ టాక్” పోటీ నిర్వహిఒచారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి టాకో ట్రస్టీలు శ్రీలత రేవూరు , జ్యోతి దండు, ఫణి భూషణ్ పొట్లూరి, కోటి బోడెపూడి, సుబ్బారెడ్డి కోవూరు బహుమతులు ప్రధానం చేశారు.