DailyDose

చిత్తూరు నుండి తమిళనాడుకు అక్రమ మద్యం రవాణ-నేరవార్తలు-05/16

Telugu Crime News Roundup Today-AP To Tamilnadu Illegal Liquor

* గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలు పునరావాస కేంద్రం నుండి సైకిళ్ళ పై తమ రాష్ట్రాలకు ప్రయాణం ప్రారంభించడంతో కృష్ణా బ్యారేజి వద్ద పోలీసులు లాఠీ చార్జ్ చేసి వెనుకకు పంపించారు
* జగ్గయ్యపేటలోని గ్రీన్ టెక్ ఎన్విరా సొల్యూషన్ కంపెనీలో గ్యాస్ లీకవుతున్న వాసనలు వెలువడడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు
* నెల్లూరు తెదేపా నేత కొతంరేడ్డీ శ్రీనివాసులరెడ్డీ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు
* తెలంగాణాలోని మున్ననూరు సమీపంలో టోల్ గేటు కోసం ఏర్పాటు చేసిన షెడ్ కూలిపోవడంతో అక్కడ ఉంటున్న ఇరువురు కూలీలు మృతి చెందారు
* గుంటూరు ఆటోనగర్ సమీపంలో లారీ డీకొని అంబులెన్స్ బోల్తా పడింది
* నిర్మల్ జిల్లా భాగ్యనగర్ లో రైలింగ్ ను డీ కొట్టిన లారీ. లారీలో ప్రయాణిస్తున్న 70 మంది వలుస కూలీల్లో 30 మందికి గాయాలు. నిర్మల్ ఆసుపత్రికి తరలింపు
* చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు బార్డర్లో ఉన్నటువంటి అన్ని చేక్ పోస్ట్ సెర్చ్ చేయాలని ఆదేశించడం జరిగింది ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు, పూనిమంగాడు వద్ద టాటా సఫారీ వాహనాన్ని తనికే చేయగా అందులో ఆంద్రప్రదేశ్ మద్యం 7 ఫుల్ బాటల్ ళ్లు,5 ఆఫ్ బాటల్ ళ్లు,120 కోటర్ బాటల్ ఉండడంతో వాటిని స్వాధీనం చేయడం జరిగింది, అందులో ఐదుగురు ని అదుపులో తీసుకోవడం జరిగిందన్నారు, వీరు తిరువల్లూర్ కు చెందిన వ్యక్తులని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు
సి. ఐ. మద్దయాచారి తెలిపారు