Agriculture

పాకిస్థాన్ మిడతలు తెలంగాణా వస్తే…?

KCR Review Meeting On Pakistan Locusts

పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌లోకి, అక్కడి నుంచి రోజుల వ్యవధిలో ఒక్కో రాష్ట్రంలోకి ‘వాయు’వేగంతో తరలి వస్తున్న మిడతలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను వణికిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడంపై రాష్ట్రాలు దృష్టి సారించాయి. తెలంగాణకు ఈ మిడతల ద్వారా ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు.

మిడతల దండు అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

మిడతల దండు రాష్ట్రానికి వస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు.