DailyDose

ఏపీలో 105 సరికొత్త కేసులు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - 105 New Corona Cases In Andhra

* ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 105 కరోనా కేసులు.. 3,118కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, ఇద్దరు మృతి, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి

* సచివాలయానికి కరోనా ఎఫెక్ట్. 3, 4 బ్లాకుల్లోకి ఎంట్రీ నిషిద్ధం. సెక్రటేరీయేట్ మొత్తం శానిటైజ్ చేస్తున్న సిబ్బంది.

* మద్యంపై కొవిడ్‌ సెస్‌ విధించాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు నుంచి మద్యం ధరపై అదనంగా ఎక్సైజ్‌, అసెస్డ్‌ రుసుము విధించారు. మద్యం ధర బట్టి రూ.రెండు నుంచి గరిష్ఠంగా 50 వరకు కొవిడ్‌ సెస్‌ ఉంటుంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని కొవిడ్‌ వ్యాప్తి నివారణ సంబంధిత కార్యక్రమాల కోసం వినియోగిస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తెలిపారు.

* వారం పాటు దిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ మార్గాలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం ప్రకటించారు. ఆన్‌లైన్‌ మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. నిత్యవసర వాహనాలతో పాటు అనుమతి పాస్‌లు ఉన్నవారు యథావిథిగా ప్రయాణం కొనసాగించవచ్చని చెప్పారు. అలాగే వచ్చేవారం మళ్లీ ఈ సరిహద్దులను తెరవాలా వద్దా అనేదానిపై శుక్రవారం వరకు ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కోరారు.

* చండీగఢ్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 294కి పెరిగింది. కరోనాతో ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. రాష్ట్రంలో 200 మంది నయమై డిశ్చార్జవ్వగా, 90 మంది చికిత్స పొందుతున్నారు.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో 373 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,083 కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 217 మంది చనిపోగా, 4,891 మంది నయమై డిశ్చార్జి అయ్యారు.

* కరోనా కోరలను కత్తిరించే టీకాల తయారీకి ప్రపంచ వ్యాప్తంగా వందలాది క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. వాటిలో ఇప్పటికే 40కి పైగా వ్యాక్సిన్‌లు ప్రయోగాల దశకు చేరాయి. కరోనా వైరస్‌కు సంబంధించి చైనా ప్రభుత్వం జెనిటిక్‌‌ డేటా విడుదల చేసిన అనంతరం వ్యాక్సిన్‌ తయారీపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లేబొరేటరీలన్నీ గట్టిగా పనిచేస్తున్నాయి.

* రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో 199 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం, ఇద్దరు వైద్య విద్యార్థులు, పోలీసులు కొవిడ్‌ బారిన పడటం ఆందోళన కలిగించే విషయమన్నారు. కరోనాపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఈ సందర్భంగా గవర్నర్‌ ట్విటర్‌ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.