Movies

నేడు మణిరత్నం జన్మదినం

The life timeline of movie director maniratnam

భారత సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం పుట్టిన రోజు. ఆయన శైలే విభిన్నంగా ఉంటుంది. మణిరత్నం తీసిన ప్రేమకథా చిత్రాలు కుర్రాకారు మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దర్శకుడిగా తొలి కన్నడ చిత్రం ‘పల్లవి అనూ పల్లవి’తో పురస్కారం అందుకుని విజయపరంపర కొనసాగించాడు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన తీసిన తొలి చిత్రం ‘గీతాంజలి’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందీ చిత్రం. అప్పట్లో తెలుగులో ఓ ప్రేమకథా చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షించిన సినిమా అది. ఇక ‘రోజా’తో ప్రేమికుల మనసు దోచేశారు. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇది ఆయనకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. మణిరత్నం ప్రేమ కథలను దేశానికి పరిచయం చేసి అఖండ విజయం నమోదు చేసిన చిత్రం అది. తర్వాత దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన ‘గాయం’ చిత్రానికి కథ రాసిందీ మణిరత్నమే. ‘బొంబాయి’ చిత్రంతో మంచి మెలోడీ హిట్టందుకున్నారు. ‘తాజ్‌ మహల్‌’ లాంటి ఎన్నో చిత్రాలకు కథ రాసి ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయారు. భారత ప్రభుత్వం 2002లో ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఇప్పటి వరకు మణిరత్నం ఆరు జాతీయ అవార్డులన కైవసం చేసుకున్నారు. ఎన్నో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులనూ అందుకున్నారు. ప్రస్తుతం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మణిరత్నం అసలు పేరు గోపాల రత్నం సుబ్రహ్మణ్యం. 1956లో జూన్‌ 2న జన్మించారు.