ScienceAndTech

4కోట్ల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థుల చదువులకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

దాంతో విద్యాసంస్థలన్ని మూతపడ్డాయి. విద్య సంస్థలు మూత పడటంతో ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యత పెరిగింది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించేలా అడుగులు వేస్తోంది.

దానికోసం రూ. 15వేల విలువ సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందివ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదించింది.

ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సమర్పించింది.

అయితే ఈ పథకంలో కేంద్రం వాటా రూ. 36,473 కోట్లు కాగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది.

ఈ పథకం ద్వారా మొత్తం 4కోట్ల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.

కాగా 2021-22 విద్యా సంవత్సరానికి గాను 1.5 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.