Kids

ప్రేమ మంచిదే…గారాబం వద్దు

Do not pamper kids - Love them at a limit

నాడు
హీరో సైకిల్, చంక లో రేడియో,
ఎక్కాల పుస్తకాలు, కిరసనాయిలు దీపాలు.
నేడు
స్పోర్ట్స్ బైక్ …యాపిల్ ఫోన్…
ఎల్ ఇ డి బల్బులు….ఇంటర్నెట్ లు
అదేమంటే……గారాబం

నాడు
సంతోషంగా..సైకిల్ రిమ్ములు తుడిచాము
ఆనందంగా దీపం గ్లాసు కడిగాము..
నేడు
బండ్లు నడపడమే తప్ప…
తుడవడమంటే ఎరుగరు…
అదేమంటే….. గారాబం

నాడు
అమ్మ నాన్న ఇచ్చే డబ్బులతో
పల్లీల ముద్దలు, పిప్పరమేట్లు
కొనే వాళ్ళం…..
పప్పు అన్నమో… సద్దన్నమో
తినేవాళ్ళం…

నేడు
నూడుల్స్, చాక్లెట్లు,
ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు,
ఫ్రైడ్ రైసులు, బిర్యాణీలు…
పిజ్జాలు…బర్గర్లు కొంటూ..తింటున్నారు..
అదేమంటే…. గారాబం

నాడు
ఆడపిల్లలు ఇల్లు అలకడం,
వాకిలి ఊడ్వడం…గడపలు కడగడం,
ముగ్గులు వేయడం…
అమ్మకు వంటలో సహాయం చేయడం

నేడు
తిన్న కంచం కూడా కడగరు
ఇల్లు ఊడ్చమంటే ఎరుగరు
వంటా వార్పు అసలేరాదు..
కర్రీ పాయింట్లు,
ఫాస్టు ఫుడ్ సెంటర్లే అతీగతి….
అదేమంటే……గారాబం

నాడు
స్కూల్లో పాఠాలు అప్పజెప్పు కున్నాం… తప్పుచేసినా…గుంజీలు తీయడం…
బెత్తంతో కొట్టడం…….ఇంట్లో చెప్పినా
అడిగేవారుండేది కాదు…

నేడు
చిన్న చిన్న దెబ్బలకే
పెద్ద పెద్ద పంచాయతీలు…
పాఠాలు చదవమంటే…
పంతుళ్ళతోటే ఫైటింగులు..
అదేమంటే…..గారాబం

నాడు
చదువంటే సంస్కారం
గురువుకో నమస్కారం
పెద్దలంటే భయం…
పనిమీద గౌరవం…

నేడు
భయంలేదు.. భక్తి లేదు..
చదువు అంతకన్న లేదు…
పెద్దలంటే భయం లేదు…
అడిగేవారు లేక…ఆవారా తిరుగుళ్ళు
ఆడవారిపట్ల….. అఘాయిత్యాలు
అదేమంటే…..గారాబం

నాడు
ఇంట్లో చెప్పకుండా తిరగనివారం
రాత్రి పది కాకముందే
పడుకొనే వారం

నేడు
అర్ధరాత్రి ఒంటి గంటైనా…
పక్క ఎక్కం… ఎవరికీ బెదరం…
అదేమంటే……గారాబం

అందుకే….
*?పిల్లలను ప్రేమించండి…
గారాబం చేయకండి…*
*?అది మీకూ నష్టం…
మన సమాజానికీ నష్టం…*
* ?ప్రేమ ముద్దు…గారాబం వద్దు