DailyDose

సరికొత్త సర్వీసులు ప్రకటించిన జియో-వాణిజ్యం

Jio Announces Glass Services - Business News

* 43వ వార్షిక సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంతో జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు తెలిపింది. ముంబైలో జరిగిన ఈ సమావేశానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీతో పాటు, ఆయన కుటుంబసభ్యులు, వ్యాపార భాగస్వాములు, షేర్ హోల్డర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా, కుమారుడు ఆకాశ్ అంబానీలు వీటికి సంబంధించిన వివరాలను వివరించారు.

* దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ 1,34,885 కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది.వేగనార్, బాలినో మోడళ్ల ఫ్యూయల్​ పంప్​లలో సమస్యలు తలెత్తొచ్చని గుర్తించి.. వాటిని సరిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.రీకాల్ జాబితాలోని కార్లు ఇవే2018 నవంబర్ 15 నుంచి 2019 అక్టోబర్ 15 మధ్య తయారైన వేగనార్(1లీటర్ ఇంజిన్​​) కార్లు, 2019 జనవరి 8 నుంచి 2019 నవంబర్ 4 మధ్య తయారైన బాలినో(పెట్రోల్ వేరియంట్లు) మోడళ్లు ఇందులో ఉన్నట్లు వెల్లడించింది మారుతీ.56,663 వేగనార్ కార్లు, 78,222 బాలినో యూనిట్లు రీకాల్ జాబితాలో ఉన్నాయి.రీకాల్ విషయంపై డీలర్లే నేరుగా వినియోగదారులను సంప్రదించనున్నట్లు మారుతీ వెల్లడించింది.

* జియోలో గూగుల్ భారీ పెట్టుబడి.జియో ప్లాట్​ఫామ్స్​కు వచ్చిన పెట్టుబడులు ఆర్థిక భాగస్వామ్యం మాత్రమే కాదన్నారు ముకేశ్.భవిష్యత్​ ప్రణాళికల్లో గూగుల్, ఫేస్​బుక్, ఇంటెల్, క్వాల్కమ్​ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వాములుగా ఉండనున్నట్లు వెల్లడించారు.గూగుల్​ కన్నా ముందు ఫేస్​బుక్ సహా మొత్తం 12 కంపెనీలు 13 దఫాల్లో జియో ప్లాట్​ఫామ్స్​లో పెట్టుబడి పెట్టాయి.25 శాతానికిపైగా వాటాను ఆయా సంస్థలకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.1,18,318.45 కోట్లు గడించింది జియో.ఈ మొత్తం పెట్టుబడుల్లో ఫేస్​బుక్ అతిపెద్ద మైనారిటీ వాటాదారుల్లో మొదటి స్థానంలో ఉండగా.. గూగుల్ రెండో స్థానాన్ని పొందనుంది.