Food

పరగడుపున మజ్జిగతో ఎన్నో ప్రయోజనాలు

పరగడుపున మజ్జిగతో ఎన్నో ప్రయోజనాలు

మన శారీరక ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే ఆనందానికి మూలం. దీన్ని మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రభావితం చేస్తాయి. పాల పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయని తెలిసిన విషయమే. అయితే సల్ల (మజ్జిగ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని పరిగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..డైట్‌ పాటించేవారు ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసు మజ్జిగ తీసుకుంటే కావాల్సిన శక్తి అందుతుంది. కేలరీలు, కొవ్వుశాతం తక్కువగా ఉంటాయి. వీటిలో జీర్ణశక్తిని పెంచే విటమిన్స్ ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం మజ్జిగను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది. కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, సమస్యలు ఉండవు. మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.ఇందులో లాక్టోజ్, కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరుగుపడేలా చేస్తుంది. తద్వారా కొవిడ్‌నుంచి తప్పించుకోవచ్చు.శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే మజ్జిగ తాగితే బ్లడ్ ప్రెషర్‌ తగ్గుతుంది. పరిగడుపున టీ, కాఫీలు తాగేబదులు మజ్జిగ తాగితే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.