Sports

మరో రికార్డు బద్ధలుకొట్టిన కంబళ శ్రీనివాస గౌడ

Indian Usain Bolt Kambala Srinivas Gowda New World Record

అభినవ ఉసేన్‌ బోల్ట్‌గా గుర్తింపు పొందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ మరో రికార్డు నెలకొల్పాడు. గతేడాది 9.55 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేసి వార్తల్లో నిలిచిన శ్రీనివాస గౌడ ఇప్పుడు 8.78 సెకన్లలోనే పూర్తిచేసి ఆ రికార్డును తిరగరాశాడు. ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్‌ తాలూకా పరిధి కక్యపడవ గ్రామంలో మైరాసత్య సంస్థ నిర్వహించిన 125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలోనే పూర్తిచేయగా దాన్ని 100 మీటర్లకు లెక్కగట్టి 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. గతవారమే వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో 100 మీటర్ల రేసును 8.96 సెకన్లలో పూర్తిచేశాడు శ్రీనివాస గౌడ. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టాడు.