Movies

లాయర్ రాశిఖన్నా

లాయర్ రాశిఖన్నా

ప్రస్తుతం దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉంది పంజాబీ సొగసరి రాశీఖన్నా. యువతరంలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా తెలుగు, తమిళ భాషల్లో చక్కటి అవకాశాలు వరిస్తున్నాయి. గోపీచంద్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలో రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని, కెరీర్‌లో అత్యంత హాస్యభరితమైన క్యారెక్టర్‌ ఇదని చెప్పింది. ‘ఈ స్థాయిలో నవ్వుల్ని పంచే పాత్రను గతంలో ఎప్పుడూ చేయలేదు. వాస్తవానికి కామెడీనే నా బలంగా భావిస్తా. మా నాన్న రాజ్‌ఖన్నాకు హాస్యచతురత చాలా ఎక్కువ. చక్కటి ఛలోక్తులు విసురుతూ అందరిని నవ్విస్తుంటారాయన. నాలో నాన్న లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని కామెడీ రోల్స్‌ చేయడానికి ‘పక్కా కమర్షియల్‌’ ప్రేరణనిచ్చింది’ అని రాశీఖన్నా పేర్కొంది. ఈ సినిమాలో ఆమె లాయర్‌ పాత్రలో కనిపించనుందని తెలిసింది. ఈ సినిమాతో పాటు తెలుగులో నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది రాశీఖన్నా.