Food

కాఫీకి హద్దులు ఉండాలి

కాఫీకి హద్దులు ఉండాలి

ఒంటికి కాఫీ ఎంత మంచిది? కాఫీ విషయంలో మన శరీరం ఏం చెబుతున్నది? బాడీ వద్దని వారించినా మరో కప్పు కాఫీ తాగుతున్నారా? అయితే, మీరు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే.. అవును, ఒక కప్పు కాఫీ ఒంటికి మంచిదే. శరీరం వద్దని వారించినా అదనంగా తాగే కాఫీవల్ల చాలా అనర్థాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. శరీరంలో కెఫిన్‌ స్థాయి సమపాళ్లలోనే ఉండాలట. లేకపోతే, కొత్త రోగాలను కొని తెచ్చుకున్నట్టేనని అంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. సౌత్‌ ఆస్ట్రేలియా హెల్త్‌ అండ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యంలో 3,90,435 మందిపై అధ్యయనం జరిపారు. వీరిలో కాఫీ ఎక్కువగా తాగేవారిలో అధిక రక్తపోటుతోపాటు అనేక సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. కాఫీ వల్ల ఆహారం తినే శక్తి మందగిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు వీలైనంత తక్కువగా కాఫీ తాగడం మంచిది. కాఫీప్రియులతో పోలిస్తే కాఫీ అలవాటు పెద్దగా లేనివారు జన్యుపరంగా వచ్చే వ్యాధులను తట్టుకుంటారని వారు కూడా వెల్లడించారు. కాఫీ వీరాభిమానుల దేశమైన ఆస్ట్రేలియాలో ప్రతి నలుగురైదుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. దీనివల్ల గుండెపోటు, గుండెజబ్బులు, మూత్రపిండ రుగ్మతలుసహా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయంటున్నారు.