Movies

చిరంజీవి పక్కన సోనాక్షి

చిరంజీవి పక్కన సోనాక్షి

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా.. మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా నటించనుందా..? త్వరలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందా..? అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్న చిరు.. డైరెక్టర్‌ బాబీతో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సందడి చేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను చిత్రబృందం సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యునరేషన్‌ కూడా బాగానే చెల్లించేందుకు ఒప్పందం జరిగిందట. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు.