Business

ఇంటర్నెట్‌కు ₹19వేల కోట్లు విడుదల చేసిన నిర్మల-వాణిజ్యం

ఇంటర్నెట్‌కు ₹19వేల కోట్లు విడుదల చేసిన నిర్మల-వాణిజ్యం

* ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్ఓ) కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58,000 కోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఖాతాదారుల పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వారి బ్యాంక్ ఖాతా వివరాలను, కేవైసి ప్రక్రియను అప్‌డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది. అప్పుడే ఎటువంటి సమస్య లేకుండా పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొంది.

* మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు ఆదా చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు రికరింగ్ డిపాజిట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి రిస్క్ ఉండదు. 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు మీరు రికరింగ్ డిపాజిట్ సేవలను పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు వస్తుందో.. అదే వడ్డీ రేటు ఆర్‌డీ ఖాతాలపై కూడా వస్తుంది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పోస్టాఫీస్‌లలో కూడా ఆర్‌డీ ఖాతాలను తెరవచ్చు. ఆర్‌డీ కాలపరిమితి ముగిసిన తర్వాత కస్టమర్ మెచ్యూరిటీ మొత్తాన్ని అందుకుంటాడు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీతో సహ కలిపి వినియోగదారులకు తిరిగి చెల్లిస్తారు.

* దేశంలో ఇంటర్నెట్‌ బ్రాడ్‌బాండ్‌ కనెక్టివీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్‌ నెట్‌ పథకానికి భారీగా నిధులు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌. ఇప్పటికే అమలవుతున్న ఈ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీకా వేయించుకోవాలనుకునే వారు కోవిన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రర్‌ చేసుకోవాలంటూ కేంద్రం ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంత ప్రజలు ఎలా రిజిస్ట్రర్‌ చేసుకుంటారంటూ ప్రతిపక్షలు ఘాటుగా విమర్శించాయి. మరోవైపు టెలి మెడిసిన్‌పై కూడా ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివి పెంచడం లక్ష్యంగా ఉద్దేశించిన భారత్‌నెట్‌కు భారీగా నిధులు కేటాయించింది.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో రికార్డు స్తాయిలను తాకిన సూచీలు ఆ తరువాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్‌ సెషన్‌ నుంచి మరింత అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన వైద్య, పర్యాటకరంగ ఉపశమన చర్యలు ఆయా రంగాలకు కొంత ఊరటనిచ్చాయి. చివరికి సెన్సెక్స్‌ 189 పాయింట్ల నష్టంతో 52735 వద్ద,నిఫ్టీ 46 పాయింట్లు క్షీణించి 15814 వద్ద స్థిరపడ్డాయి.