DailyDose

చిత్తూరు జిల్లాలో నకిలీ బంగారం పట్టివేత-నేరవార్తలు

చిత్తూరు జిల్లాలో నకిలీ బంగారం పట్టివేత-నేరవార్తలు

* చిత్తూరు జిల్లా గంగవరం మండలం కూర్నిపల్లి వద్ద నకిలీ బంగారం విక్రయించే ముగ్గురు ముఠా సభ్యులను వలపన్ని పట్టుకున్న పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రమేష్ అతని స్నేహితులు ఇద్దరు కలిసి, తమకు చిత్తూరు జిల్లా కాణిపాకం వద్ద చెరువులో జెసిబి ద్వారా మట్టి తీస్తుండగా మట్టి కుండ కనబడిందని, అందులో కిలో బరువు గల బంగారుహారం దొరికిందని అదే జిల్లాకు చెందిన పల్లపు రాజు కు తెలిపారు, ఇంత బంగారాన్ని మేము అమ్ముకో లేమని మాకు కొంత డబ్బు ఇచ్చి ఇది తీసుకోమని నమ్మబలికారు. దీంతో 12 లక్షలకు బేరం కుదుర్చుకుని ,వారిని నెల్లూరు, తిరుపతి ,పలమనేరు బైపాస్ రోడ్లలో తిప్పి చివరకు గంగవరం మండలం బెంగళూరు హైవే వద్దకు రమ్మని చెప్పి 12 లక్షలు తీసుకొని నకిలీ బంగారం వారికి ముట్టజెప్పి వెళ్లిపోయారు. తీరా బంగారాన్ని పరీక్షించగా నకిలీదని తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు కట్టి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు వాడిన మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా వారి ఆచూకీ కనిపెట్టి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి తొమ్మిది లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

* గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన అనిత… తన తల్లి దీనమ్మకు డ్వాక్రా సంఘం ద్వారా రూ.లక్ష మంజూరయ్యాయి.ఆ డబ్బులను తన కుమారుడు ప్రేమరాజు ఖాతాలో జమ చేయాల్సిందిగా కూతురు అనితను కోరింది.దీంతో అనిత మంగళవారం మధ్యాహ్నం కొత్తపేటలోని ఎస్బీఐకు వెళ్లింది.బ్యాంకులో ఒకేసారి రూ.లక్ష జమచేయడం సాధ్యం కాదని,రోజుకు రూ.49వేలు మాత్రమే జమ చేస్తామని సిబ్బంది చెప్పారు.ఇదంతా గమనించిన ఓ వ్యక్తి… తాను బ్యాంకు సిబ్బందినని,ఖాతాలో మొత్తం నగదును ఒకేసారి జమ చేయిస్తానని నమ్మించాడు.రెండు వోచర్లలో రూ.70వేలు,రూ.30వేలు చొప్పున రాసి…బ్యాంకులో డబ్బులు వేస్తున్నట్లు నటించి,ఖాతాలో డబ్బు జమ అయినట్లు వోచర్లను అనితకు ఇచ్చాడు.

* హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న పాస్టర్ హనీ జాన్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.యూట్యూబ్‌లో మతపరమైన ప్రసంగాలు చేస్తూ తన వీడియోలలో హిందు దేవుళ్లను, మహిళలను కించపరిచే విధంగా ప్రసంగాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.దాంతో హనీ జాన్సన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.అనంతరం 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.హనీ జాన్సన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి.సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదయినట్లు సమాచారం.

* మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 74 వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ…కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టు పిటిషన్ లో పేర్కొన్న పలువురు అనుమానితు లను విచారిస్తున్న సీబీఐ సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు…పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహంలో విచారణ నిలిపివేత కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా కొనసాగుతున్న విచారణ…సునీల్ యాదవ్ ను కస్టడిలోకి కోరే అవకాశం..నార్కో అనాలసిస్ పరీక్షల పీటీషన్ పై 27న విచారణ..నిన్న నాలుగు గంటల పాటు సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సుధీర్ఘ చర్చ..పలు అంశాలపై సీబీఐ అధికారులకు వివరించినట్లు సమాచారం.