Business

ఆఫ్ఘానిస్తాన్‌లో ప్లేటు భోజనం ₹7400-వాణిజ్యం

ఆఫ్ఘానిస్తాన్‌లో ప్లేటు భోజనం ₹7400-వాణిజ్యం

* గత కొద్ది రోజుల క్రితం చైనా తీసుకున్న నిర్ణయం భారతదేశ వాణిజ్యం మీద భారీ ప్రభావం పడనుంది. ప్రపంచంలో అత్యంత రద్దీ గల పోర్టుల్లో చైనాలోని నింగ్‌బో పోర్టు అనేది మూడవది. అయితే, అక్కడ పనిచేసే ఒక కార్మికుడు రెండు వారాల క్రితం కరోనా వైరస్‌ బారిన పడడంతో ఎటువంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆ పోర్టును మూసివేశారు. దీంతో ప్రపంచ వాణిజ్యంతో పాటు మన దేశం మీద కూడా ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా మన దేశంలోని ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ మీద ఎక్కువ ప్రభావం పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. “ఓడరేవు మూసివేత వల్ల చైనా నుంచి రావలసిన కొన్ని నౌకలు అక్కడే ఉండిపోవడం, కొన్ని ఖాళీ కంటైనర్ నౌకలు చిక్కుకు పోవడంతో ఎలక్ట్రానిక్ భారత దేశ వాణిజ్యం మీద ప్రభావం పడింది. ఇప్పుడు ఆ నింగ్‌బో పోర్టు తెరవడం వల్ల అక్కడ ఉన్న నౌకలు మన దేశానికి బయలుదేరాయి. ఈ మధ్య కాలంలో ఏర్పడిన వాణిజ్య కొరతలో కనీసం 10 శాతం కొరతను పరిష్కరించాలని మేము(పరిశ్రమ) ఆశిస్తున్నాము” అని ఈఈపీసీ ఇండియా వైస్ చైర్మన్ అరుణ్ గరోడియా పేర్కొన్నారు.

* ఆఫ్‌రోడ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా ఉన్న మహీంద్రా థార్‌కు గట్టిపోటీ ఎదురవబోతుంది. ఈ సెగ్మెంట్‌లో థార్‌కి పోటీగా గూర్ఖా తెస్తోంది ఫోర్స్‌ మోటార్స్‌ కంపెనీ. రాబోయే పండగ సీజన్‌లో ఈ ఎస్‌యూవీని మార్కెట్‌లో రిలీజ్‌ చేసేందుకు వీలుగా సన్నహకాలు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల సోషల్‌ మీడియాలో టీజర్‌ వదిలింది.

* ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడానికి ఆగస్టు 30 గడువు సమీపిస్తున్నందున కాబూల్ విమానాశ్రయం వెలుపల పరిస్థితి రోజు రోజుకి మరింత క్షీణిస్తూనే ఉంది. విమానాశ్రయం వెలుపల అనేక మంది ఆఫ్ఘన్లు దేశం నుంచి పారిపోవడానికి విమానాశ్రయానికి వస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం లోపలికి వెళ్ళడానికి ప్రజలు విమానాశ్రయం పక్కన ఉన్న మురికి కాలువలో నిలిచి ఉంటున్నారు. అయితే, ఆ ప్రాంతం దగ్గర రద్దీ రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబూల్ విమానాశ్రయ ప్రాంగణం సమీపంలో ఉన్న ఆహార, నీరు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాయిటర్స్ వీడియో ప్రకారం.. విమానాశ్రయం వెలుపల ఉన్న ఆఫ్ఘన్ జాతీయుడు తన దగ్గర నీటి బాటిళ్లను 40 డాలర్లకు(దాదాపు రూ.3,000) విక్రయిస్తున్నట్లు తెలిపారు. కాబూల్ విమానాశ్రయంలో ఆహారం & నీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్న వీడియోను రాయిటర్స్ పంచుకుంది. “ఒక బాటిల్ నీటిని 40 డాలర్లకు, ఒక ప్లేట్ బోజనాన్ని 100 డాలర్ల(రూ.7,375)కు విక్రయిస్తున్నారు. ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు” అని ఆయన అన్నారు. మరోవైపు, తాలిబన్ పాలన నుంచి పారిపోవడానికి వేలాది మంది ఆఫ్ఘన్లు కాబూల్ విమానాశ్రయం గేట్ల వద్ద ఇంకా వేచి చూస్తున్నారు.

* గ‌త కొద్దిరోజులుగా కాస్త‌ త‌గ్గుముఖం ప‌ట్టిన ప‌సిడి ధ‌ర‌లు శుక్ర‌వారం భార‌మ‌య్యాయి. ఎంసీఎక్స్‌లో ప‌దిగ్రాముల బంగారం రూ 300 పెరిగి రూ 47,519 ప‌లికింది. ఇక కిలో వెండి దాదాపు రూ 500 పెరిగి రూ 63,220కి ఎగ‌బాకింది.