Movies

సమంత నా సోదరి సమానురాలు. ప్రకాష్‌రాజ్ రాజీనామా-తాజావార్తలు

సమంత నా సోదరి సమానురాలు. ప్రకాష్‌రాజ్ రాజీనామా-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో 14 ఎమ్మెల్సీకి స్థానాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది స్థానిక సంస్థల నుండి 11 ,ఎమ్మెల్యేల కోట నుండి మరో 3 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది.గత ఆరు నెలలుగా ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.!!ప్రధానంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఖాళీల భర్తీ నిన్నటి వరకు కోర్టు అడ్డంకి ఉండేదికోర్టు నుండి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో కౌంటింగ్ పూర్తయి అన్ని జిల్లాలో ఎంపిపి,జెడ్పిటిసి స్థానాలు భర్తీ పూర్తి అయింది.!!అయితే శాసనమండలిలో 58 స్థానాలు ఉండగా,అధికార వైకాపా పార్టీకి ఇప్పటికే 18 స్థానాలు ఉన్నాయి.!!ఖాళీగా ఉన్న 14 స్థానాలు భర్తీ చేస్తే అన్ని కూడా వైకాపా ఖాతాలో పడనున్నాయి.!!దింతో వైకాపా బలం మండలిలో పెరిగి చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను సైతం కైవసం చేసుకోనుంది.!!

* చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రెండ్రోజులు పర్యటించనున్నారు.

* శ్రీ వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలాలో భాగంగా గరుడసేవ దృష్ట్యా మరియు అనుబంద కార్యక్రమాల నేపధ్యంలో తిరుపతి నగరం నందు స్వల్ప ట్రాఫిక్ మళ్ళింపు.

* శ్రీశైలం డ్యాం రెండుగేట్లు ఎత్తివేత.ప్రస్తుతం జలాశయంలో 211.4385 టీఎంసీల నీరు.589.70 అడుగులకు చేరిన నాగార్జునసాగర్‌ నీటిమట్టం.పులిచింతలకు 44,783 క్యూసెక్కుల విడుదల .శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

* మా సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్.నేను తెలుగు వాడిని కాదు, ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు, తెలుగు వారు మాత్రమే మా అధ్యక్షుడిగా ఉండాలని అన్నారు, అలానే చేశారు, ప్రాంతీయత ఆధారంగా మా ఎన్నిక, నేను తెలుగు వాడిని కాదు, నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు, తెలుగు పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణము చేశా, అలానే పరిశ్రమలో కొనసాగుతా నటిస్తూ ఉంట.నేనొక అతిథిగా వచ్చాను అతిధిగానే కొనసాగుతూ ఉంట.ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విష్ణుకి హితవు.గెలిచిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన ప్రకాష్ రాజ్.తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు.ఆలోచించి తీసుకున్న నిర్ణయం.రాజకీయంగా కూడా నన్ను లాగి ట్వీట్ తో విశ్లేషణ చేసినందుకు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజాయ్ కి ధన్యవాదాలు.కంట తడి పెట్టుకుంటూ మా సభ్యత్వానికి రాజీనామా.ప్రకాష్ రాజ్

* మెగా బ్రదర్ నాగబాబు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు . ంఆఆ ఎన్నికల సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్కు మద్దతిచ్చిన నాగబాబు .. విష్ణు గెలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు . ‘ ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న ంఆఆ లో కొనసాగడం నాకు ఇష్టం లేక రాజీనామా చేస్తున్నాను . సెలవు . ఇది ఎంతో చిత్తశుద్ధితో ఆలోచించి తీసుకున్న నిర్ణయం ‘ అని నాగబాబు చెప్పాడు .

* ఇక నుంచి వాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం, మాకు వాక్సిన్ వద్దు అనటానికి లేదు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కడికి వెళ్లినా వాక్సిన్ సర్టిఫికెట్ 1స్ట్ డోస్ కానీ 2వ డోస్ కానీ వేసుకున్న సర్టిఫికెట్ చూపించటం తప్పనిసరి, లేక పోతే నో ఎంట్రీ తక్షణం అమలు చేస్తున్న ప్రభుత్వం. ఆలయ దర్శనానికి వెళ్లిన, కాలేజీలకు వెళ్లిన, హాస్పిటల్స్ కి వెళ్లిన, పోలీస్ స్టేషన్ కి వెళ్లిన, కోర్ట్ కి వెళ్లిన, ఎక్సమ్స్ రాయటానికి వెళ్లిన అది ఇది అని లేకుండా ఎక్కడికి వెళ్లినా మీకు లైసెన్స్ లాగా వాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ప్రతి పౌరుడు గమనించి వాక్సిన్ త్వరగా వేసుకోగలరు.

* కథానాయిక సమంత తన భర్త, హీరో నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమె మీద విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. వీరి మధ్య దూరానికి కారణమంటూ ప్రీతమ్‌ జుకల్కర్‌ని దూషించడం మొదలుపెట్టారు సామ్‌-చై అభిమానులు. ఇన్నాళ్లూ ఈ విషయంపై ఎప్పుడూ పెదవి విప్పని జుకల్కర్‌.. తొలిసారి ఈ రూమర్స్‌పై స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సమంతని నేను అక్కలా భావిస్తా. తనని జీజీ (హిందీలో ‘అక్క’) అని పిలుస్తా. అలాంటిది మా ఇద్దరి మధ్య ఏదో ఉందని ఎలా అనుమానిస్తారు?’’ అని ప్రశ్నించారు.

* సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఓబీసీ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ‘‘మోదీ వన్ నేషన్ వన్ సెన్సెక్స్‌ను ఎందుకు తీసురావడం లేదు? మోదీ ప్రభుత్వం కులగణన చేయకపోవడంలో మతలబు ఏంటి? కుల గణన చేస్తేనే రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరు. బీసీలు కులగణన కోరడంలో న్యాయముంది. బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పోరాడుతుంది. అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలా న్యాయం చేయాలో ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. సమగ్ర కుటంబ సర్వేను కేసీఆర్‌ ఎందుకు బయటపెట్టడం లేదు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఇప్పటికైనా సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయటపెట్టాలి. బీసీ సంఘాలు చేసే అన్ని ఉద్యమాలకు కాంగ్రెస్‌ మద్దతు ఉంటుంది’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

* తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గరుడోత్సవంలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న సీఎం జగన్‌.. బర్డ్‌ ఆసుపత్రికి చేరుకుని అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల హృదయాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సాయంత్రం తిరుమల కొండపైకి చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి పట్టువస్త్రాలను మోసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. ఆయన వెంట దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి ఉన్నారు. సోమవారం రాత్రి తిరుమలలో బస చేయనున్న సీఎం జగన్‌.. మంగళవారం మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి తదితర సమస్యలపై పరస్పర సమన్వయంతో పోరాడాలని భారత్‌, యూకే నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో సంభాషించారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘బోరిస్ జాన్సన్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా భారత్‌- యూకే ఎజెండా 2030 పురోగతిని సమీక్షించాం. దీంతోపాటు గ్లాస్గోలో సీఓపీ-26 సమావేశం నేపథ్యంలో వాతావరణ మార్పుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అఫ్గాన్‌ సహా ఇతర ప్రాంతీయ సమస్యలపై చర్చించాం’ అని పేర్కొన్నారు. క్వారంటైన్‌ నిబంధనలు, వ్యాక్సిన్‌ ధ్రువపత్రాల గుర్తింపు విషయంలో ఇటీవల బ్రిటన్‌, భారత్‌ మధ్య వివాదం చెలరేగడం, చివరకు బ్రిటన్‌ దిగిరావడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల ప్రధానులు మాట్లాడుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్‌ టీకా ధ్రువీకరణ పత్రాలను బ్రిటన్‌ గుర్తించడం స్వాగతించదగిన పరిణామమని ఇద్దరు నేతలూ అంగీకరించినట్లు సమాచారం.

* ఏపీలో వచ్చే నెలలో ఇళ్లకు కరెంట్‌ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఆక్షేపించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారన్న ఆయన 80 లక్షల మంది విద్యార్థులకు రెండేళ్లుగా ఉపకార వేతనాలు విడుదల చేయడం లేదంటూ మండిపడ్డారు. త్వరలోనే అమరావతి ప్రాంతానికి రాహుల్‌ గాంధీని తీసుకొస్తామన్నారు. రాజధాని రైతుల కన్నీళ్లను కాంగ్రెస్‌ తుడుస్తుందని హామీ ఇచ్చారు.

* త్రిదండి శ్రీ చినజీయర్‌ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిశారు. ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీమణి శోభ, కుటుంబసభ్యులతో కలిసి ఆయన వెళ్లారు. యాదాద్రి నూతన ఆలయం ప్రారంభంపై చినజీయర్‌స్వామితో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. అంతకుముందు కేసీఆర్‌ దంపతులను చినజీయర్‌ శాలువాతో సత్కరించారు.

* రోజురోజుకు పెరుగుతున్న రవాణా, వర్తకులు, రైతుల అవసరాల దృష్ట్యా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్కుకు తరలిస్తున్నామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దసరా రోజున బాటసింగారంలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పారు. అదే రోజున పూర్తిస్థాయిలో మార్కెట్‌ ఏర్పాటుకు కొహెడలో వర్తకులకు ఇచ్చే స్థలాల్లో నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ తరలింపు నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై కసరత్తులో భాగంగా మంత్రులు నిరంజన్‌రెడ్డి, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి కొత్తపేట విక్టోరియా మైదానాన్ని పరిశీలించారు. కమీషన్‌ ఏజెంట్లతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్కును సందర్శించారు.