Health

మలేరియా టీకా వస్తోంది

మలేరియా టీకా వస్తోంది

ఈ దశాబ్దం చివరికల్లా మలేరియాను దేశంనుంచి తరిమికొట్టాలనే లక్ష్యంతో భారత్‌ ముందడుగు వేస్తోంది. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ నెల మొదటి వారంలో ఆమోదించిన మలేరియా టీకా (ఆర్‌టీఎస్‌, ఎస్‌) వినియోగంపై భారత్‌ సహా, ఇతర మలేరియా ప్రభావిత దేశాలు ఎంతో ఆసక్తిని, ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తున్నాయి. మలేరియా పరాన్నజీవులను నియంత్రించేందుకు రూపొందిన తొలి టీకా ఇది. మూడు దశాబ్దాల సుదీర్ఘ పరిశోధనల తరవాత ఆవిష్కృతమైన ఈ టీకాను నాలుగు డోసుల్లో తీసుకోవలసి ఉంటుంది. మొదటి మూడు డోసులను అయిదు నుంచి పదిహేడు నెలల వయసులో, నాలుగో డోసును పద్దెనిమిది నెలల తరవాత అందిస్తారు. మలేరియా పరాన్నజీవిపై ఈ టీకా ముప్ఫై శాతమే ప్రభావం చూపుతుందని, అయినప్పటికీ మలేరియా మరణాలను డెబ్భై శాతం మేర తగ్గిస్తుందని వివిధ దశల్లో జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.