DailyDose

TNI నేటి తాజా వార్తలు – 08/01/2022

TNI నేటి తాజా వార్తలు –  08/01/2022

* ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. నేటి నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.

* దేశ రాజధాని న్యుదిల్లిల్లో శనివారం తెల్లవారుజామున భారి వర్షం కురవడంతో జనజీవనం స్థంబించింది.

* ఏపీలో సచివాలయ ఉద్యోగులు తమను విడుదల చేయాలని కోరుతూ నిరసన బాట పట్టారు.

* ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి, దాస్‌ అలియాస్ చిన్నాలకు అధికార పార్టీకి చెందిన వారితో ప్రాణహాని ఉందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లిరు..పులి.దాస్ టీడీపీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. అది దృష్టిలో పెట్టుకొని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఆయనపై పగ పెంచుకున్నారని.. ఈ నేపథ్యంలోనే దాస్‌ను నందిగాం సురేష్ టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఎంపీ సురేష్ ఆదేశాలతో ఇప్పటికే దాస్ పై 30కేసులు పెట్టారని.. గతేడాది సెప్టెంబర్ 18న ఎంపీ నందిగాం సురేష్ అనుచరులు ఉద్దండరాయునిపాలెంలో దాస్ పై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాబు లేఖలో పేర్కొన్నారు. దాస్ బిన్‌ను చంపాలనే ఉద్దేశంతో ప్రతి రోజు అతని కదలికలను అనుసరిస్తూ ఆయన ఇంటిపై నిఘా ఉంచారని డీజీపీకి లేఖద్వారా తెలిపారు బాబు. దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, దాస్‌కు ఎలాంటి హాని జరగకుండా చూసేందుకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని బాబు కోరారు.

*హైకోర్టులో రేషన్ డీలర్లకు అనుకూలంగా తీర్పు వెలువడింది.

* మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

* తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 3న ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబం ఘటన.. కొత్తగూడెం టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ అరెస్టుపై ఏఎస్పీ రోహిత్ రాజ్ మీడియాతో మాట్లాడారు. “ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి తానూ నిప్పంటించుకున్నారు. ఘటనాస్థలిలో రామకృష్ణ, శ్రీక్ష్మి సాహిత్య చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దకుమార్తె సాహితీ మృతిచెందింది. ఈ నెల 3న రామకృష్ణ బావమరిది జనార్దన్ ఫిర్యాదుతో పాల్వంచ పీఎస్ లో కేసు నమోదు చేశాం ఐపీసీ 302, 307, 306 సెక్షన్ల కింద కేసు పెట్టాం ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు సూ సైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో వనమా రాఘవపై ఆరోపణలు చేశారు. ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఇతర కారణాలు ఉన్నాయని వీడియోలో చెప్పారు. రాఘవ, సూర్యవతి, మాధవి కారణంగానే చనిపోతున్నట్లు తెలిపారు. నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నిన్న రాత్రి వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నాం. దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశాం. పలు అంశాలపై రాఘవను విచారించాం. రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించారు. లభ్యమై ఆధారాలను సీజ్ చేసి కోర్టుకు సమర్పించాం. నిందితులను ఇవాళ కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాం. రాఘవపై మొత్తం 12కేసులు ఉన్నాయి. గతంలో నమోదైన కేసులపై విచారణ చేయనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

*వైకుంట ఏకాదశి పురస్కరించుకుని ఈనెల 10వ తెదే నుంచి వైకుంట ద్వారా దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

* ఆర్టీసి బస్సు టైరు పేలి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా 44 మంది ప్రయాణీకులు బయట పడ్డారు.

* పంజాబ్‌ రైతుల నిరసనపై ప్రధాని మోదీ కొత్త నాటకానికి తెరతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తననను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని నరేంద్ర మోదీ సానుభూతి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నటనలో నేచురల్‌ స్టార్‌ నానిని నరేంద్ర మోదీ మించిపోయారన్నారు.