DailyDose

రేవంత్ రెడ్డి అరెస్ట్ – TNI నేర వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్  – TNI  నేర వార్తలు

* తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు హైదరాబాద్ పోలీసులు.ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాపు కాసిన పోలీసులు కాసేపటికి తన అరెస్టు చేశారు.ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిరసన కార్య క్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు.రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఈ అరెస్ట్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరాచక పాలనను అంతమొందించి వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కెసిఆర్ నియంతృత్వ పాలన ను అంతమొందిస్తామని నిప్పులు చెరిగారు.

* ఆవు దూడపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి పైశాచికానందం
కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు దుండగులు దారుణ చర్యకు పాల్పడ్డారు. ఆవు దూడతో అసహజ శృంగారం చేశారు. వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్ అల్వార్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. నలుగురు దుండగులు ఓ ఆవు దూడతో అసహజ శృంగారం చేశారు. అంతటితో ఆగకుండా.. ఈ దారుణాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అది వైరల్గా మారింది. నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారుఫిబ్రవరి 10న ఈ ఘటన జరగగా.. బాధిత రైతు ఫతే మహ్మద్ ఫిబ్రవరి 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులను తలీమ్(19), ఛున్నా(20), జుబేర్(21), వారిస్గా (25) గుర్తించి.. వారిపై ఐపీసీ సెక్షన్లు 377, 34 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు పోలీసులు.

*రవాణాకు అడ్డాగా పశ్చిమ ప్రాంతం నక్షత్ర తాబేళ్లు
ప్రకాశం జిల్లా కనిగిరి చిట్టడవులు, ఎర్రటి నేలలు, రాళ్ల గుట్టల్లో నివసించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అక్రమార్కుల చేతుల్లో చిక్కి విదేశాలకు తరలిపోతున్నాయి.నివాసానికి అనువైన వాతావరణం పశ్చిమ ప్రకాశంలోనే ఉండటంతో స్మగ్లర్ల కన్ను పడింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందా వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తాబేళ్ల అక్రమ రవాణాపై అధికారుల తనిఖీలు తూతూమంత్రంగా సాగడం అక్రమార్కులకు ఊతంగా మారింది. ఇటీవల నెల్లూరు జిల్లా తడ వద్ద ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తరలిస్తున్న 250 నక్షత్ర తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన పోలీసు అని తెలిసి అందరూ అవాక్కయ్యారు.కనిగిరి ప్రాంతంలో నక్షత్ర తాబేళ్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. నియోజకవర్గంలోని కనిగిరి, పునుగోడు, యడవల్లి, చల్లగిరగల, వేములపాడు, సీఎస్‌పురం, వెలిగండ్ల, మాలకొండ అడవులు, అయ్యనకోట, బోడవాడ, బొట్లగూడూరు, కంభాలదిన్నె, లక్ష్మక్కపల్లి, శంకరాపురం, లోదుర్గంతో పాటు మర్రిపూడి, పొన్నలూరు, కొనకనమిట్ల మండలాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది.వీటిని విష్ణుమూర్తి అవతారంగా భావించి కొందరు ఇళ్లలో పెంచుకుంటారు. పలు వ్యాధుల నివారణకు మంచిదని మరికొందరు వీటి మాంసం తింటారు. అదేవిధంగా వీటి పైభాగాన ఉండే చిప్పలు మందుల తయారీకి ఉపయోగిస్తుండటంతో ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇదే ఆసరాగా స్మగ్లర్లు స్థానికులను దళారులుగా మార్చి నక్షత్ర తాబేళ్లను వేటాడిస్తున్నారు. వాటిని చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలకు అక్కడి నుంచి బంగ్లాదేశ్‌, మయన్మార్‌, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

*నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఆటోను ఢీకొట్టిన లారీ, ఆటోను కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో ఒకరు ఆటోలో చిక్కుకుని చనిపోగా.. మరో ఇద్దరు లారీ చక్రాల కింద నలిగిపోయారు.

* ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రా రామ‌కృష్ణ నివాసంపై ఐటీ దాడులు
నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ చిత్రా రామ‌కృష్ణ నివాసాల‌పై ఐటీ అధికారులు గురువారం దాడులు చేప‌ట్టారు. ఎన్ఎస్ఈ కీల‌క స‌మాచారాన్ని అజ్జ్ఞాత వ్య‌క్తికి చేర‌వేస్తూ ఆమె అక్ర‌మంగా ల‌బ్ధి పొందార‌నే ఆరోప‌ణ‌ల‌పై చిత్రా రామ‌కృష్ణ‌న్ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు.ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌ను చీఫ్ స్ట్రేట‌జిక్ అధికారిగా నియ‌మించే క్ర‌మంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) ఇటీవ‌ల చిత్రా రామ‌కృష్ణ‌కు రూ 3 కోట్ల జ‌రిమానా విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాల‌ని సెబీ ఆమెను ఆదేశించింది.మ‌రోవైపు హిమాల‌యాల్లో నివ‌సించే యోగి క‌నుస‌న్న‌ల్లో తాను న‌డుచుకున్నాన‌ని చిత్రా రామ‌కృష్ణ వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే దానిపై చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు యోగి, చిత్రా రామ‌కృష్ణ మ‌ధ్య జ‌రిగిన ఈ మెయిల్ సంభాష‌ణ‌లూ ఇటీవ‌ల వెలుగుచూశాయి.

*ఉత్తర ప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఖుషీనగర్‌ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది బావిలో పడి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివాహ కార్యక్రమానికి హాజరయిన వీరంతా బావి స్లాబ్‌పై కూర్చున్నారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా స్లాబ్‌ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్లాబ్‌పై కూర్చున్న 13 మంది బావిలో పడిపోయారు.ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఖుషీనగర్‌ ప్రమాదంలో మరణించిన వారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

* నిషేధిత మత్తు పదార్థమైన గంజాయి నుంచి తీసిన యాష్ ఆయిల్‌ను ఎర్రగడ్డలో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 198 స్మాల్ బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా ఆరు లక్షల విలువచేసే యాష్ ఆయిల్ బాటిల్స్, ముగ్గురు వ్యక్తులను, 3 సెల్‌ఫోన్లతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

* నకిలీ పంచ లోహ విగ్రహాల అమ్మకం.. ముగ్గురు అరెస్ట్‌
అనంతపురం నకిలీ పంచ లోహ విగ్రహాలను అమ్ముతూ పలువురిని మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇత్తడితో తయారు చేసిన విగ్రహాలను పంచలోహాలుగా నమ్మిస్తూ మోసం చేస్తూ పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. వీరి నుంచి 12 ఇత్తడి విగ్రహాలు, రూ.5,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

* సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంతుల్‌తండాలో భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించగా, స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించగా నిందుతుడి అదుపులోకి తీసుకున్నారు.

* హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాచారం పీఎస్‌ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కూతురును చంపి, ఆ పై తానూ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. దీపిక, చంద్రశేఖర్‌కు మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు జన్మనించింది. అయితే, కూతురు పుట్టిందని తరుచూ భర్త వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. భార్య, బిడ్డను చంద్రశేఖరే చంపి ఉంటాడని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

*ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్‌ జిల్లా (Kushinagar) నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో 13 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్‌ జరుగుతున్నది. ఈ సందర్భంగా కొందరు మహిళలు, యువతులు బావి పైకప్పుపై నిల్చున్నారు. అయితే బరువు అధికమవడంతో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.

*మార్టూరు మండలంలోని తాటివారిపాలెంలో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆమె భర్త బేల్దారి పనుల నిమిత్తం హైదరాబాదు వెళ్లగా ఆమె పిల్లలతో తండ్రి వద్ద ఉంటుంది. ఏమైందో తెలియదు కానీ ఇంటిలో ఉన్న బలం మందు బిళ్లలు, ఇంకా పాత టాబ్లెట్లను పొడిగా చేసి నీళ్లలో కలిపి తాగింది. కొద్దిసేపటికి పరిస్థితిని గమనించిన తండ్రి 108 వాహనానికి సమాచారమిచ్చారు. వారు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియలేదు.

*బ్రెజిల్ దేశంలో సంభవించిన మెరుపు వరదల్లో 78 మంది దుర్మరణం చెందారు.భారీవర్షాల వల్ల బ్రెజిల్ దేశంలోని పెట్రోపోలిస్ నగరంలోని వీధులు నదులుగా మారాయి. వరదనీటి ధాటికి చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి.

*భర్త, అత్తామామలు అధిక వరకట్నం కోసం వేధించడంతో ఓ గర్భిణి మంగళవారం రాత్రి జహీరాబాద్‌లోని ఎన్‌జీవో కాలనీలో ఉరేసుకున్నది.

*రాయలసీ యూనివర్సిటీలో పరిధిలోని డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో 17 మంది డీబార్‌ అయ్యారని పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ కె. విశ్వనాథరెడ్డి తెలిపారు. జిల్లాలోని 75 పరీక్షా కేంద్రాల్లో 3వ సెమిస్టర్‌ పరీక్షలకు 3,209 మంది దరఖాస్తు చేసుకోగా 2,914, మధ్యాహ్నం 5వ సెమిస్టర్‌ 6,461 దరఖాస్తు చేసుకోగా 5,771 హాజరయ్యారని తెలిపారు.

*సంతానం కాలేదన్న బాధలో సోదరుడి కొడు కును పెంచుకున్న ఓ తల్లి ఆ కసాయిచేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది ఈ కేసు లో హత్యకు పాల్పడిన పెంపుడు కొడుకు జీవితకాలం పాటు కటకటాలను లెక్కించేలా కోర్టు తీర్పు చెప్పింది.

*ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖుషినగర్ జిల్లాలోని ఓ గ్రామంలో వివాహ వేడుకల సందర్భంగా జరిగిన పెద్ద ప్రమాదంతో విషాదం అలముకుంది.యూపీలోని ఖుషీనగర్‌లో ప్రమాదవశాత్తు బావిలో పడి 11 మంది మహిళలు మృతి చెందారు.

*భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానంతో భార్య ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగుచూసింది. గంపలగూడెం మండలం అనుమల్లంక గ్రామానికి చెందిన నాగబత్తిన నాగేంద్రబాబుకు కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన భాగ్యమ్మ (27)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. నాగేంద్రబాబు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.తన భర్త నాగేంద్రబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని భాగ్యమ్మకు అనుమానం వచ్చింది. ఈ విషయంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కలత చెందిన భాగ్యమ్మ ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో భాగ్యమ్మ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.