Devotional

భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామచంద్రమూర్తి బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నవమి రోజు కల్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం అనవాయితీ. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ రోజున శ్రీరామ నామస్మరణ చేస్తే మన మనసుకు ఆయనే రాజు అనే భావన స్థిరపడుతుంది. మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం కనుల విందుగా సాగుతోంది. శ్రీత్రిదండి చినజీయర్ స్వామి ఈ క్రతువునకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీతాసమేతంగా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం రాజదండం, రాజఖడ్గం, రాజముద్రిక ఒక్కొక్కటిగా స్వామివారికి అలంకరించారు.శ్రీరామచంద్రుని గుణగణాలతో పాటుగా శ్రీరామరాజ్యం వైభవాన్ని వేదపండితులు వివరించారు.పట్టాభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే జరిపిస్తారు. అనంతరం ఆయన మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. జై శ్రీరామ్ అన్న నినాదాలతో మిథిలా ప్రాంగణం మార్మోగుతోంది. స్వామి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను చేశారు.
b-1
b-2
b-3
b-4
b-5
b-6