Politics

ఇంటింటా నిరుద్యోగం.. ఇదే ఇప్ప‌టి నినాదం – TNI రాజకీయ వార్తలు

ఇంటింటా నిరుద్యోగం.. ఇదే ఇప్ప‌టి నినాదం  – TNI రాజకీయ వార్తలు

* దేశంలోని నిరుద్యోగిత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కేంద్రంపై మ‌ళ్లీ మండిప‌డ్డారు. మోదీ ఇచ్చిన అనేక మాస్ట‌ర్‌స్ట్రోక్స్‌తో దేశంలోని 45 కోట్ల మంది నిరుద్యోగులు త‌మ ఆశ‌ను కోల్పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రాహుల్ తీవ్రంగా మండిప‌డ్డారు.ఈ ఘ‌నత వ‌హించిన మొట్ట మొద‌టి ప్ర‌ధాని మోదీయే అంటూ రాహుల్ చుర‌క‌లంటించారు. ప్రతి ఇంట్లో ఓ నిరుద్యోగి.. ఇంటింటా నిరుద్యోగం (హ‌ర్ ఘ‌ర్ బేరోజ్‌గారీ… ఘ‌ర్ ఘ‌ర్ బేరోజ్‌గారీ) ఇదే ఇప్ప‌టి నినాద‌మ‌ని రాహుల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా దెప్పి పొడిచారు.”ప్ర‌ధాని మోదీ ఇచ్చిన మాస్ట‌ర్ స్ట్రోక్స్‌తో 45 కోట్ల నిరుద్యోగులు ఉద్యోగంపై ఆశ‌లు కోల్పోయారు. 75 సంవ‌త్స‌రాల్లో ఇలా చేసిన ప్ర‌ధాని ఈయ‌న‌దే. గ‌త ఐదేళ్ల‌లో 2.1 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. 45 కోట్ల మంది ఉద్యోగాల వెతుకులాట‌నే మానేశారు” అంటూ రాహుల్ ట్వీట్ చేశారు

*రైతులను ఆదుకోని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది: Sharmila
పోడు భూముల సమస్య పరిష్కరించడంలో సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. జిల్లాలోని బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీ అధినేత్రి మాట్లాడుతూ… పట్టాలు ఇవ్వక పోగా ఉన్న వాటికి లాక్కున్నారన్నారు. రైతులు కోటీశ్వరులు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రశ్నించారు. తప్పుడు సంతకం పెట్టి యాసంగిలో రైతులను నిండా ముంచారన్నారు. రైతులను ఆదుకోని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించక పోవడం వల్లనే కేసీఆర్ అరాచకాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని షర్మిల అన్నారు

*ప్రశాంత్‌కిషోర్ ఓ పాగల్:
ప్రశాంత్‌కిషోర్ ఓ పాగల్ అని మాజీ ఎంపీ వివేక్‌ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…పీకే పీఎం కావాలని కోరుకుంటున్నారని ఇటీవల కేటీఆర్ అన్నారని తెలిపారు. ఇప్పడు అదే పీకే సాయం తీసుకుంటున్నారని.. టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ ఎంతగా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యలు చేశారు. పీకే సహాయం తీసుకోవడం ద్వారా టీఆర్ఎస్ ఓడిపోయినట్లు కేసీఆర్‌ అంగీకరించినట్లే అని తెలిపారు. ప్రజలంతా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. పీకే తెర పైకి వచ్చి తెలంగాణ కాంగ్రెస్‌లో కన్ఫ్యూషన్ తెచ్చారని విమర్శించారు. తెలంగాణలో అవినీతి, నియంత పాలనకు ప్రజలు బుద్ధిచెప్పబోతున్నారన్నారు. టీఆర్ఎస్‌కు వ్యూహకర్తగా ఉంటే పీకేకీ కూడా నష్టమే అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకీ పట్టం కడతారని వివేక్‌ స్పష్టం చేశారు

*మోదీ మాస్టర్‌స్ట్రోక్స్‌తో 45 కోట్ల మంది ఆశలు అడుగంటాయి : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట్విటర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని, మోదీ అత్యంత నైపుణ్యంతో అమలు చేస్తున్న చర్యల వల్ల 45 కోట్ల మందికిపైగా తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశలను వదులుకున్నారని ఆరోపించారు. 75 ఏళ్ళలో ఈ విధంగా చేసిన మొదటి ప్రధాన మంత్రి మోదీయేనని మండిపడ్డారు. నవ భారతంలో నూతన నినాదం ‘‘ఇంటింటా నిరుద్యోగం’’ అని పేర్కొన్నారు. గడచిన ఐదేళ్ళలో 2.1 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోయారని, 45 కోట్ల మంది ఉద్యోగాల కోసం అన్వేషించడం మానేశారని చెప్తున్న ఓ నివేదికను రాహుల్ ప్రస్తావించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవల సిలబస్‌ను సవరించింది. 11, 12 తరగతుల సిలబస్ నుంచి ఆఫ్రో-ఆసియన్ టెరిటరీస్‌లోని ఇస్లామిక్ రాజ్యాల ఎదుగుదల, క్రానికల్స్ ఆఫ్ ముఘల్ కోర్ట్స్, ది కోల్డ్ వార్, ఇండస్ట్రియల్ రివల్యూషన్ అధ్యాయాలను చరిత్ర, రాజనీతి శాస్త్రం నుంచి తొలగించింది. దీనిపై రాహుల్ గాంధీ ఏప్రిల్ 9న ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రక్షించాలంటే, ఆరెస్సెస్ చేతుల్లో ఉన్న సంస్థలను పరిరక్షించాలని చెప్పారు. సీబీఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సప్రెసింగ్ ఎడ్యుకేషన్ అని అభివర్ణించారు

*గెలిచిన వాళ్ళు రాజులు కాదు.. ప్రజా సేవకులు: గల్లా జయదేవ్
తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిందని.. వ్యవస్థలన్నీ బలహీన పడుతున్నాయన్నారు. అయితే ఒక వ్యవస్థ నిర్ణయాలపై మరో వ్యవస్థ పరిశీలిస్తుందన్నారు. అమరావతి వంటి కేసులు ఏపీ ప్రభుత్వం చాలా ఓడిపోయిందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతోందని, గెలిచిన వాళ్ళు రాజులు కాదని, ప్రజా సేవకులు అన్న విషయం తెలుసుకోవాలని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు

*డబుల్ బెడ్రూం ఇళ్లపై టీఆర్‌ఎస్ నేతల దందా: Vijayashanti
పేదల‌కు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇళ్లను కొందరు టీఆర్ఎస్ లీడర్లు బేరం పెట్టి దందా చేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్ వేదికగా మాట్లాడుతూ…. లక్ష, రెండు లక్షల చొప్పున వసూలు చేసి రాత్రికి రాత్రే లిస్టులు మార్చేస్తున్నారని ఆరోపించారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని, అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుచరుల పేర్లు చేరుస్తున్నారన్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇళ్లను 3 నెలల కిందట ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి గ్రామస్తులకు పంపిణీ చేశారని బీజేపీ నేత తెలిపారు. ఎలాంటి భూమి, జాగ లేకుండా గుడిసెల్లో ఉండే పేదలను కాదని అప్పటికే ఇళ్లు ఉన్నవాళ్లకు డబుల్బెడ్రూం ఇల్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి దక్కినవాళ్లలో ఇళ్లు, ఇతర ఆస్తిపాస్తులు ఉన్న గ్రామ సర్పంచ్ తల్లితో పాటు ఎమ్మెల్యే అనుచరులున్నారని తెలిపారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని, దీనిపై గ్రామానికి చెందిన ఎ.కొండన్న, సి.లక్ష్మయ్య, బోయ ఊశన్న, పి.మన్యం, చంద్రయ్య తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విజయశాంతి అన్నారు.చివరికి బాధితులంతా హైకోర్టును ఆశ్రయించారన్నారు. విచారణ చేపట్టిన కోర్టు… రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ, వనపర్తి జిల్లా కలెక్టర్, మిరాసిపల్లి గ్రామ సెక్రటరీకి ఇటీవల నోటీసులు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. లబ్ధిదారుల వివరాలతో హాజరు కావాలని ఆదేశించిందని తెలిపారు. లబ్ధిదారుల వివరాలు పరిశీలించిన అనంతరం… సగం మంది అనర్హులు ఉన్నట్టు తేలడంతో మొత్తం కేటాయింపులు రద్దు చేసి తిరిగి అర్హులను ఎంపిక చేయాలని హైకోర్టు తీర్పు చెప్పిందని బీజేపీ నేత చెప్పారు. అలాగే సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక మున్సిపాలిటీ, పెద్ద‌పల్లి జిల్లా మంథ‌ని, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో కూడా అచ్చు గుద్దినట్టు ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రిగాయన్నారు. అర్హుల‌కు తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని ల‌బ్దిదారులు హెచ్చ‌రిస్తున్నారని విజయశాంతి పేర్కొన్నారు.

*ప్రశ్నిస్తే గొంతు నులముతున్నారు : నక్కా ఆనందబాబు
ప్రశ్నిస్తే గొంతు నులముతున్నారని… నోరు ఎతిత్తే అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు వాపోయారు. 800 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. మాజీ సీఎం ప్రశ్నిస్తే మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన దళిత, గిరిజనులను మోసం చేశారన్నారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి ద్రోహం చేశారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. సీపీఎస్ గురించి అడిగితే ఉద్యోగులను స్టేషన్‌లలో కుక్కుతున్నారన్నారు. తాడేపల్లి మొత్తం ముళ్ల కంచే వేసి 800 మంది పోలీసులతో సీఎం దాక్కున్నాడన్నారు. అధ్యధిక అప్పులు ఉన్న రాష్ట్రం ఏపీ అని.. ఇది త్వరలోనే మరో శ్రీలంక లేదంటే వెనిజూలా కావడం ఖాయమ నక్కా ఆనంద బాబు పేర్కొన్నారు

*టీఆర్ఎస్ గాలి మాటలు చెప్పే పార్టీ కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి
ఆది నుంచి తెలంగాణకు అడ్డుపడి, కించపరిచే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న అదే రీతిని అవలంభిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతో పోల్చితే ఏ రాష్ట్రం కూడా దరిదాపున లేదన్నారు. టీఆర్ఎస్ వట్టిమాటలు, గాలి మాటలు చెప్పే పార్టీ కాదన్నారు. దేశ ప్రధానిగా ఉన్న మోదీ.. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా ఎక్కడా అభివృద్ధి కనిపించటం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనపడని వాళ్ళు యాత్రల పేరిట తిరుగుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు

*ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధం: అచ్చెన్నాయుడు
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజల మద్దతు టీడీపీకే ఉందన్నారు. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ఏపీ మరో శ్రీలంక అవుతుందన్నారు. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ 160 స్థానాలు గెలుస్తుందని, మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులు చిత్తు కాగితాలతో సమానమని అన్నారు. విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌లో యువతిపై మూడు రోజులు అత్యాచారం జరిగితే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎవరూ రాక పోతే బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారన్నారు. చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాల కంటే జగన్ చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మఒడి మోస పూరిత పథకమని, సీఎం జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఆయన పతనం ప్రారంభమైందన్నారు. పవన్ కల్యాణ్‌కు ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతున్నారని, పవన్‌ను ఎదుర్కోలేక దత్తపుత్రుడని ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు

*అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?: Lokesh
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం. నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ’’ అని ప్రశ్నించారు. చేతగాని పాలకుడు జగన్ రెడ్డి చెత్త పాలన కారణంగా అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కిలోమీటర్లు బైక్‌పై తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తిరుపతి రుయా ఆస్పత్రి నుండి బాలుడు జేసవా మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కావాలని వేడుకున్నా కనికరం చూపలేదని టీడీపీ నేత మండిపడ్డారు. ప్రైవేట్ అంబులెన్స్‌ల ధరలు తట్టుకోలేక బైక్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కి.మీ.మేర బాలుడి మృతదేహాన్ని తండ్రి తరలించారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలని లోకేష్ డిమాండ్ చేశారు

*ప్రజలను నమ్మించి మోసగించడంతో జగన్ సిద్ధహస్తుడు: Tulasireddy
ప్రజలను నమ్మించి మోసగించడంలో ముఖ్యమంత్రి జగన్ సిద్ధ హస్తుడు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… మాట తప్పడం- మడమ తిప్పడం జగన్ దినచర్య అని అన్నారు. జగన్ పేరు వింటానే విశ్వసనీయత అనే పదం పారిపోతుందన్నారు. రైతులను, రైతు కూలీలను, ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను, యువతను, మద్యం విషయంలో మహిళలను, పెళ్లి కానుక విషయంలో చెళ్ళెమ్మలను, అగ్రిగోల్డ్ బాధితులను ఇలా అందరినీ మోసగించారని దుయ్యబట్టారు. ‘‘ఉద్యోగులకు సబంధించి సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. సకాలంలో పీఆర్సీ అమలు చేస్తాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తాం. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తాం అని ఎన్నికల మేనిఫెస్టో స్పష్టంగా పేర్కొనడం జరిగింది’’ చెప్పారు. అధికారంలోకి వచ్చాక పై హామీలను విస్మరించారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా హామీలను అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు

*ఇంటింటా నిరుద్యోగం.. ఇదే ఇప్ప‌టి నినాదం : రాహుల్‌
దేశంలోని నిరుద్యోగిత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కేంద్రంపై మ‌ళ్లీ మండిప‌డ్డారు. మోదీ ఇచ్చిన అనేక మాస్ట‌ర్‌స్ట్రోక్స్‌తో దేశంలోని 45 కోట్ల మంది నిరుద్యోగులు త‌మ ఆశ‌ను కోల్పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని రాహుల్ తీవ్రంగా మండిప‌డ్డారు.ఈ ఘ‌నత వ‌హించిన మొట్ట మొద‌టి ప్ర‌ధాని మోదీయే అంటూ రాహుల్ చుర‌క‌లంటించారు. ప్రతి ఇంట్లో ఓ నిరుద్యోగి.. ఇంటింటా నిరుద్యోగం (హ‌ర్ ఘ‌ర్ బేరోజ్‌గారీ… ఘ‌ర్ ఘ‌ర్ బేరోజ్‌గారీ) ఇదే ఇప్ప‌టి నినాద‌మ‌ని రాహుల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా దెప్పి పొడిచారు.”ప్ర‌ధాని మోదీ ఇచ్చిన మాస్ట‌ర్ స్ట్రోక్స్‌తో 45 కోట్ల నిరుద్యోగులు ఉద్యోగంపై ఆశ‌లు కోల్పోయారు. 75 సంవ‌త్స‌రాల్లో ఇలా చేసిన ప్ర‌ధాని ఈయ‌న‌దే. గ‌త ఐదేళ్ల‌లో 2.1 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. 45 కోట్ల మంది ఉద్యోగాల వెతుకులాట‌నే మానేశారు” అంటూ రాహుల్ ట్వీట్ చేశారు

*రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు పటిష్టం చేయాలి: పెద్దిరెడ్డి
ఎర్రచందనంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు పటిష్టం చేయాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మగ్లింగ్‌కు చెక్‌ పెట్టాలన్నారు. త్వరలో కర్నాటక, తమిళనాడు, అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే మంత్రుల స్థాయిలో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మాట్లాడి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డు కట్ట వేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 వేల 376 మెట్రిక్‌ టన్నుల సీజ్‌ చేసిన ఎర్రచందనం ఉందన్నారు. ఈ ఎర్రచందనాన్ని విక్రయించేందుకు సీఐటీఈఎస్‌ను అనుమతి కోరామన్నారు. ఈ నిల్వలు అమ్మడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తోందన్నారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన సోమ్ములో 30 శాతం ఎర్ర చందనం కన్సర్వేషన్‌కు ఉపయోగించాలని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

*గెలిచిన వాళ్ళు రాజులు కాదు.. ప్రజా సేవకులు: గల్లా జయదేవ్
తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిందని.. వ్యవస్థలన్నీ బలహీన పడుతున్నాయన్నారు. అయితే ఒక వ్యవస్థ నిర్ణయాలపై మరో వ్యవస్థ పరిశీలిస్తుందన్నారు. అమరావతి వంటి కేసులు ఏపీ ప్రభుత్వం చాలా ఓడిపోయిందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతోందని, గెలిచిన వాళ్ళు రాజులు కాదని, ప్రజా సేవకులు అన్న విషయం తెలుసుకోవాలని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.

*రేవంత్ ఆ సవాల్‌కు కట్టుబడి ఉండాలి: మంత్రి అజయ్
కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న.. సవాల్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అజయ్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ నాయకులకు కళ్లు మూసిన తెరచినా నేనే కనపడుతున్నా. నీతికి నీజాయితీకి కట్టుబడ్డ కుటుంబం పువ్వాడ కుటుంబం. పేదల ఆస్పత్రిగా వేలమంది డాక్టర్లను మమత మెడికల్ కళాశాల తీర్చిదిద్దింది. మంత్రి కేటీఆర్‌ని చూసి నేనే కాదు అరవై లక్షల మంది కార్యకర్తలు లేచి లేచి పడుతున్నారు.. కేటీఆర్ కేసీఆర్‌లను చూసి ఉప్పొంగిపోతాం. రేణుకా‌చౌదరి చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసు.రేణుకాలా నేను మాట్లాడగలను…నాకు సంస్కారం అడ్డు వస్తుంది. ఖమ్మం జిల్లా ప్రజలు అమాయకులు కాదు…. కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఒకొక్కడు కాదు షేర్ ఖాన్.. వందల మంది రండి చూసుకుందామంటూ మంత్రి అజయ్ సినిమా డైలాగ్ చెప్పారు. ఖమ్మంలో కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయి’’ అని మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రేవంత్‌రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు: కొప్పుల
ఖమ్మం వేదికగా రేవంత్‌రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి పంటను కొంటున్నామన్నారు. రేవంత్ మాటలను నమ్మటానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదన్నారు. హుజూరాబాద్‌లో పార్టీని తాకట్టుపెట్టిన రేవంత్‌ పీసీసీ చీఫ్‌గా ఎలా ఉంటున్నారోనని వ్యాఖ్యానించారు. బీజేపీతో కాంగ్రెస్‌ది ఢిల్లీలో శత్రుత్వం, రాష్ట్రంలో స్నేహమన్నారు.

*టీఆర్ఎస్‌కు ఓట్లేయించడమే వారి ఒప్పందం: విజయశాంతి
దేశవ్యాప్తంగా పొత్తులు ఏర్పరుచుకుని ఎంఐఎం సుమారు 20 ఎంపీలు గెల్చికోవడం, అందుకు అవసరమైన సకల వనరులు కేసీఆర్ సమకూర్చడం ఆ రెండు సయామీ ట్విన్ పార్టీ పెద్దల అవగాహన అని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. అందుకు ప్రతిగా తెలంగాణలో హైదరాబాద్ తప్ప మరెక్కడా పోటీ చేయకుండా ఉండి, ఎంఐఎం ఓట్లు టీఆరెస్‌కు వేయించడం వారి ఒప్పందమని ఆమె చెప్పారు. అందుకే వేరే రాష్ట్రాల్లో పోటీ చేసే ఎంఐఎం ఇక్కడ మాత్రం పోటీ చేయదన్నారు. ఈ విషయం టీఆర్ఎస్ ఎంత దాచినా ప్రజలకు తెలిసిన బహిరంగ రహస్యమేనని చెప్పారు. టీఆరెస్, కాంగ్రెస్, ఎంఐఎంలకు దేశవ్యాప్త అవగాహన విస్తరణ కార్యాచరణ కార్యక్రమం ప్రశాంత్ కిషోర్‌ది అనేది విస్పష్టమైందని విజయశాంతి తెలిపారు.

*వైఎస్సార్ ఇక్కడి ఎన్నోసార్లు వచ్చారు: షర్మిల
ప్రజా ప్రస్థానం పాదయాత్ర ను 800 కిలోమీటర్లు ముగించుకొని భద్రాచల లో అడుగు పెట్టామని వైఎస్ షర్మిల తెలిపారు. కోట్ల మంది తెలుగు ప్రజలకు పుణ్య స్థానం భద్రాచలమన్నారు. భద్రాచలం టౌన్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలకు రాజధాని ఈ భద్రాచలమన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా భద్రాచలంకి ఎన్నో సార్లు వచ్చారని గుర్తుచేశారు. ఇదే గడ్డ నుంచి పోడు పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. అలాగే ఇదే భద్రాచలం నుంచి పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించారని ఆమె చెప్పారు. ఇదే ప్రాంతం నుంచి అటవీ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నారు. 2006 లో అటవీ చట్టం వచ్చాక వైఎస్సార్ ఇదే గడ్డ నుంచి 3లక్షల 30 వేల ఎకరాలకు హక్కు కల్పిస్తూ పట్టాలను వారి చేతిలో పెట్టారని ఆమె గుర్తుచేశారు. ఈ దేశం లో అత్యధికంగా లక్షల ఎకరాలకు భూములు ఇచ్చిన రికార్డ్ వైఎస్సార్ దన్నారు.

*రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: జీవన్‌రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలని ఎద్దేవా చేశారు. ధాన్యం సేకరణతో సర్కార్ నష్టపోతుందని మంత్రి అంటున్నారు..మంత్రి ఏమైనా ఇంట్లో నుంచి ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు. సాగు చెయ్యని భూములకు కనీసం 15 వేలు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచే ఉద్యమం ప్రారంభం అవుతుందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

*కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: ప్రవీణ్‌కుమార్‌
సీఎం కేసీఆర్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, దుర్మార్గమైన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో సోమవారం రాత్రి బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. అంబేద్కర్‌ ఆశయాల సాధనే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తోందన్నారు. తన పర్యటన భూదాన్‌పోచంపల్లి మండలంలో సాగుతుండగా మూడున్నర గంటలపాటు ఓర్వలేక, అక్కసుతో కరెంటు కోత విధించారని సీఎం కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ ద్వంద్వ విధానాలతో అణగారిన వర్గాలు మరోసారి మోసపోకూడదని సూచించారు.

*హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.? : చంద్రబాబు
ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్‌రెడ్డి ప్రతీకారం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘న్యాయం కోసం రోడ్డెక్కితే అణిచివేత లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమానికి నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి కూడా వీల్లేదనేలా అరెస్టులు చేస్తున్నారు.హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.?దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాసంవత్సరాన్ని జూన్ 12 నుంచి జులై 8కి మార్చడం ఏంటి?స్కూళ్లను మూసివేయడం వంటి విధానాలతో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారు.నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొంగిలించడబడడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు

*మహిళల వేధింపుల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపారు: బోండా ఉమా
వాసిరెడ్డి పద్మ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ అయ్యాకే ఆంధ్రప్రదేశ్ మహిళలపై అఘాయిత్యాల్లో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేస్తోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాసిరెడ్డి పద్మ పనితీరుపై తాము విమర్శలు చేయడం కాదు, ఎన్సీఆర్బీ నివేదికే చెప్తోందన్నారు. చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని నెంబర్ 1స్థానంలో ఉంచితే, జగన్‌రెడ్డి మహిళల వేధింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైఫల్యాలను వాసిరెడ్డి పద్మ రోడ్డు మీదకి లాగిందని చెప్పారు.ఎక్కడికక్కడ మాదకద్రవ్యాల వాడకం పెరగటంతో పాటు ప్రభుత్వం తమనేం చేయదులే అనే ధీమా నేరస్థుల్లో నెలకొందన్నారు.వాసిరెడ్డి పద్మ ప్రవర్తన చూసి మహిళలే అస్యహించుకుంటున్నారన్నారు. మానసిక వికలాంగురాలిపై జరిగిన ఘటన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలోనే మరో రెండు ఘటనలు జరిగాయని తెలిపారు.మహిళా భద్రతకు తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకే 27న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టామని బోండా ఉమా పేర్కొన్నారు.

*జగన్‌ది రాక్షస పాలన: కాలవ
‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను వంచించడమే ఆయన లక్ష్యం. పిచ్చితుగ్లక్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారు. సీఎంగా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నియంతృత్వ పాలన సాగిస్తున్న వైసీపీకి సమాధికట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. వారం రోజుల్లోనే సీపీఎ్‌సను రద్దు చేస్తానని ఆర్భాటంగా హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. సీపీఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడం దారుణం. ఉపాధ్యాయులకు సంబంధించిన తాజా జీవో చూస్తే.. ‘విద్యార్థులు ఇంట్లో… ఉపాధ్యాయులు బళ్లో’ అన్న చందంగా ఉంది’’ అని కాలువ ఎద్దేవా చేశారు.

* హోదా కోసం తీవ్ర ఉద్యమం: చలసాని
ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు చేపట్టే ఉద్యమంలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు వివరించనున్నట్టు తెలిపారు. భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని, కలసిరాని వాళ్లు ఆంధ్రా ద్రోహులుగా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అధికార, ప్రతిపక్షాలు పాల్గొనాలని కోరారు. సమావేశంలో జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రొఫెషనల్‌ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు, విద్యార్థి సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.