DailyDose

టుడే న్యూస్ అప్డేట్స్

టుడే న్యూస్ అప్డేట్స్

ఈరోజు ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష చేపట్టనున్న సీఎం జగన్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నాడు-నేడు తదితర అంశాలపై చర్చ

నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్, సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరిక.. ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్, రేపు ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులతో జరుగనున్న న్యాయ సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్

నేడు ఢిల్లీలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటన, రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మమతా బెనర్జీ మకాం

ఐపీఎల్ 2022: నేడు పంజాబ్ కింగ్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ ఢీ, పూణె వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్

ఈరోజు ఢిల్లీలో హైకోర్టు సీజేల సదస్సు,సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో సదస్సు సదస్సులో పాల్గొననున్న 25 హైకోర్టుల సీజేలు

నెల్లూరులో నీటి పారుదల సలహా బోర్డు సమావేశం,హాజరుకానున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

పశ్చిమగోదావరి: నేటి నుంచి రెండు రోజుల పాటు మార్టేరులో గోదావరి మండల పరిశోధన విస్తరణ సాంకేతిక సలహా మండలి సమావేశాలు హాజరుకానున్న ఐదు జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు

అనంతపురం: తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నేడు నారీ సంకల్ప దీక్ష కార్యక్రమం.. హాజరుకానున్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత*

నేడు హైదరాబాద్‌ రానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. 12 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్న గడ్కరీ.. నేషనల్ హైవేలను జాతికి అంకితం చేయనున్న గడ్కరీ.. శంషాబాద్‌లో ప్రారంభోత్సవ బహిరంగ సభ*