Movies

జోరు … జోరు

జోరు … జోరు

ఇటు దక్షిణాదిలో, అటు ఉత్తరాదిలో అవకా శాలుపొందుతూ విజయోత్సాహంలో ఉంది అల్లరి పిల్ల రష్మికామండన్నా. ఈమధ్య ఆమె జన్మదినం సందర్భంగా రష్మిక నటించే సినిమాలకు సంబం ధించిన ప్రత్యేక అప్డేట్స్న మేకర్స్ అందించ డంతో మరింత సంబరపడిపోయింది. ‘ఇంతకుమించిన బర్త్ డే స్పెషల్ గిఫ్ట్ ఏముంటుంది’అంటూ ఆనందంగా ట్వీట్చేసింది. తమిళ నటుడు విజయ్ సరసన నటించే అవ కాశం లభించింది. ఇది తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం. దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు, తమిళ, మలయాళభాషల్లో ఏకకాలంలో రూపొందే సినిమాలో రష్మిక కీలకపాత్ర పోషిస్తోంది. కాశ్మీరీ యువతిగా ఇంతకుముందు పాత్ర లకు భిన్నంగా కనిపిస్తుందట. వీటిలోని రష్మిక ఫస్ట్లుక్స్ విడుదలయ్యాయి.