NRI-NRT

సింగపూర్‌లో డా.రామ్ మాధవ్ పుస్తక పరిచయం

సింగపూర్‌లో డా.రామ్ మాధవ్ పుస్తక పరిచయం - Singapore Telugu Indian News - Ram Madhav Book Intro - Singapore Telugu Indian News - Ram Madhav Book Intro

భాజపా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి డా.రామ్ మాధవ్ రచించిన “ది హిందుత్వ పారడైమ్” పుస్తక పరిచయం-విశ్లేషణ కార్యక్రమం సింగపూర్‌లో నిర్వహించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రామ్ మాధవ్ మాట్లాడుతూ హిందుత్వం భారతదేశంలో ప్రధాన స్రవంతి వంటిదని అది ఒక జీవన విధానమని,అందులో ద్వేషానికి చోటులేదన్నారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి నిర్వాహకులు కవుటూరు రత్నకుమార్ం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ్ భాగవతుల, రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సురేష్ చివుకుల, యోగేష్ హిందూజ, సంజయ్, ఊలపల్లి భాస్కర్,రాధిక మంగిపూడి, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి అతుల్, ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులు పాల్గొన్నారు.