DailyDose

బైక్‎ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు – TNI నేర వార్తలు

బైక్‎ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు – TNI  నేర వార్తలు

*నాగార్జున యునివర్సిటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సెక్రటేరియట్‎కు వెళ్తున్న మంత్రి విడదల రజనీ. ప్రమాద బాధితులను మంత్రి రజనీ పరామర్శించింది. బాధితులను స్వయంగా అంబులెన్స్‎లో ఆసుపత్రికు తరలించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి జీజీహెచ్ సూపరిండెండెంట్‎కు ఫోన్ చేసి చెప్పింది. గాయాలను వ్యక్తులు ఇద్దరు విజయవాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
*హైదరాబాద్: నగరంలోని కుల్సుంపుర పీఎస్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. బాబును హత్య చేసి మూసినదిలో పడేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
*మాదాపూర్ శిల్పకళా వేదికలో ఎల్లుండి జరగబోయే సిరివెన్నెల సీతారమశాస్ట్రీ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు..ఈ కార్యక్రమం ఏర్పాటు పైన నివేదిక ఇవ్వడం కోసం స్టేజి పై నించొని ఫోటో లు తీస్తూ స్టేజి సమీపంలో ఉన్న గుంత లో పడిపోయాడు… దీనితో తీవ్ర గాయాలపాలైన డి.ఎస్.పి ని స్థానికంగా ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించగా తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతూ సాయంత్రం తుది శ్వాస విడిచారు..ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కుమార్ అమ్మిరేశ్ స్వస్థలం బీహార్ రాష్ట్రాలోని పాట్నా…ఆయన భార్య
ఇద్దరు పిల్లలు తో జూబ్లీహిల్స్ ఐ బి క్వార్టర్స్ లో నివాసం….కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…
*ఉద్యోగం లేక, కుటుంబ సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి నేనా వత్‌ నాగేంద్రబాబు నాయక్‌ (24) ఇంట్లో ఫ్యా న్‌కు ఉరివేసుకున్నాడు. ఈ ఘటన పట్ట ణం తే నేనావత్‌ నాగేశ్వరావునాయక్‌కు ఇద్దరు కు మారులు. వీరు ఎంఎస్‌ చదువుకుని ఇంటి వద్దే ఉంటున్నారు. తండ్రి మానసికస్థితి బాగులేక పోవడంతోపాటు కుటుంబ సమస్యలు ఉన్నా యి. చదువుకున్నా ఉద్యోగం లేదన్న మన స్తాపంతో నాగేంద్రబాబు నాయక్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం డాబాపైన పడు కున్న తల్లిదండ్రులు కిందికి వచ్చి చూసేసరికి కొడుకు మృతి చెంది ఉన్నా డు. ఎస్‌ఐ కోటయ్య పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుత్రికి తరలించారు.
*యలమంచిలి గ్రామానికి చెందిన చింతు చిన్నమ్మడుతో సహా పిల్లల సజీవదహనం కేసులో ముగ్గురిని బుధవారం సీఐ ఎం.తిరుపతిరావు అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు. ఈ నెల 5న చిన్నమ్మడు తనతోపాటు పిల్లలు శ్రీరంజని, జాహ్నవి, వెంకటసాయిపై పెట్రోల్‌ పోసుకొని సజీవ దహనానికి పాల్పడింది. ఈ ఘటనలో చిన్నమ్మడుతో సహా కుమార్తె జాహ్నవి, కుమారుడు వెంకటసాయి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో కుమార్తె శ్రీరంజని వాంగ్మూలం మేరకు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో చిన్నమ్మడు అత్త దమయంతి, భర్త చింతు నర్సింహులు, ఆడపడచు కళ్యా ణం అమ్మలును అరెస్టు చేసి నరసన్నపేట కోర్టులో హాజరు పరిచినట్టు పేర్కొన్నారు.
*తిరువళ్లూర్‌ జిల్లాలో అన్నడీఎంకే పంచాయతీ అధ్యక్షుడిని భార్యా, పిల్లల కళ్ల ముందే దారుణంగా హతమార్చిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు… తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరు యూనియన్‌ కొండకరై గ్రామ పంచాయతీ అధ్యక్షుడుగా మనోహరన్‌ (35) రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం రాత్రి కరివిమేడు గ్రామంలో బంధువుల ఇంటి శుభకార్యక్రమంలో కుటుంబంతో పాల్గొని కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. మనోహరన్‌ నడుపుతున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, రోడ్డు పక్కనే ఉన్న గుంతలో చిక్కుకుంది. స్వల్పగాయాలు తగిలిన మనోహరన్‌ కారు నుంచి వెలుపలికి వచ్చే సమయంలో కారులో నుండి దిగిన గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై మారణాయుధాలతో తీవ్రంగా దాడిచేసి పరారయ్యారు.
*నీలాంగరైలో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మృతదేహాన్ని కుమారుడు ఓ డ్రమ్ములో వుంచి, దానిని తెరిచేందుకు వీలు లేకుండా.. చుట్టూ సిమెంట్‌ పూయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని మానసిక స్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతుండగా, అతను తల్లిని హత్య చేశాడా? లేక మరణించాక దాచి పెట్టాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* కోయంబేడు బస్టాండు నుంచి బయలుదేరిన బస్సులో పీకల వరకు మద్యం సేవించిన ఓ తాగుబోతు చేసిన దాడిలో బస్సు కండక్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. టిక్కెట్‌ తీసుకోమని చెప్పిన కండక్టరుతో గొడవకు దిగి ఆ తాగుబోతు.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ, కండక్టర్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.