DailyDose

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్​ శతజయంతి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్​ శతజయంతి వేడుకలు

ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఎన్టీఆర్ జయంతిని నిర్వహించారు. గొల్లపూడిలో భారీ కేక్‌ కట్‌ చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.. అనంతరం తేదేపా కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమానికి వెళ్లారు.స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహించారు. తెదేపా సినీయర్ నాయకులు డా.మన్నే రవీంద్ర ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఒంగోలు సమీపంలో జరుగుతున్న పసుపు పండగ ‘మహానాడు’కు తెలుగు తమ్ముళ్లు బల్దేరారు. మన్నె రవీంద్ర వాహనాలను జెండా ఊపి సాగనంపారు.కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. తెదేపా, తెలుగు ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. కేక్ కోసి నేతలకు పంపిణీ చేశారు. కావాలనే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ అర్జునుడు ధ్వజమెత్తారు. గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సుమారు 200 ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. సామాజిక న్యాయం పేరిట వైకాపా తలపెట్టిన బస్సు యాత్ర ఇవాళ గన్నవరం చేరనున్న నేపథ్యంలో.. తొలుత శతజయంతిని పురస్కరించుకుని తెదేపా నేతలు స్థానిక హైవేపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో వైకాపా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మరోవైపు గాంధీబొమ్మ కూడలిలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా స్టేజ్ కట్టడంపై మండిపడ్డారు.విజయవాడ గొల్లపూడిలో మాజీ మంత్రి తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్​ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గొల్లపూడి వన్ సెంటర్​లో భారీ కేక్​ కట్​చేశారు. అనంతరం వందలమంది తేదేపా కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమానికి బస్సుల్లో బయల్దేరారు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ నివాళులర్పించారు.క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన శ్రీ నందమూరి తారక రామారావు గారి పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.తెలుగువారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం ఎన్టీ​ఆర్​ది అని కొనియాడారు. క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన ఎన్టీఆర్ పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ నివాళులర్పించారు. సీఎంగా ఎన్టీఆర్‌ సేవలను ట్విటర్‌ వేదికగా గవర్నర్ ప్రస్తావించారు.