NRI-NRT

బ్రిటన్ రాణి ఆభరణాల ప్రదర్శన.. కళ్లముందు నిలవనున్న చరిత్ర..

బ్రిటన్ రాణి ఆభరణాల ప్రదర్శన.. కళ్లముందు నిలవనున్న చరిత్ర..

బ్రిటన్ రాణి ఎలిజబెత్.. సింహాసనాన్ని అధిష్టించి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఓ ఎగ్జిబిషన్ జరగనుంది. రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్‌లో.. ఎలిజబెత్ పట్టాభిషేక సమయంలో తీసిన ఫొటోలు, ఆ వేడుకలో రాణి ధరించిన నగలు ప్రదర్శనకు ఉంచుతారు. అంతేకాకుండా.. రాణిగా ఈ 75 ఏళ్ల కాలంలో వివిధ సందర్భాల్లో ఆమె ధరించిన అనేక అభరణాలు కూడా ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచనున్నారు. 1953 నుంచి 1971 మధ్య విడుదలైన వివిధ బ్రిటన్‌ పోస్టల్ స్టాంపులపైనున్న చిత్రాలకు ఈ ఫొటోలే మూలం. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన అక్టోబర్ 2వరకూ కొనసాగుతుంది.
07212022184153n73
బ్రిటన్ రాణి ఆభరణాల ప్రదర్శన.. కళ్లముందు నిలవనున్న చరిత్ర..డైమండ్ డయాడెమ్‘ది క్వీన్స్ ఎక్సెన్షన్’ పేరిట జరిగే ఈ ప్రదర్శన కోసం.. దాదాపు 3 ఏళ్ల తరువాత బకింగ్‌హ్యామ్ స్టేట్ రూమ్స్ తలుపులు సామాన్య ప్రజల కోసం తెరుచుకోనున్నాయి. బ్రిటన్ రాణి వ్యక్తిగత స్థాయిలో ధరించిన అనేక ఆభరణాలు ప్రజాసందర్శనార్థం కొలువుదీరనున్నాయి. తన 21వ పుట్టినరోజు సందర్భంగా అమ్మమ్మ బహూకరించిన గాజులు, రాణి నిత్యం దరించే ముత్యాలహారం, టియారా అనే ఓ కరమైన కిరీటం.. తదితర ఆభరణాలు వీక్షకులను కట్టిపడేస్తాయని చెప్పకతప్పదు. ఈ ప్రదర్శనలో ఢిల్లీ దర్బార్ నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 1911లో ఇండియాలో జరిగిన ఢిల్లీ దర్బార్ కార్యక్రమంలో రాణి మేరీ ఈ నెక్లెస్‌ను ధరించారు. ఆమె తదనంతరం.. ఈ ఆభరణం రాణి ఎలిజబెత్‌కు వారసత్వంగా అందింది. ప్రపంచంలో అతిపెద్ద వజ్రంగా పేరుపడ్డ కలినన్ డైమండ్‌ నుంచి తయారు చేసిన 8.8 కారెట్ వజ్రాన్ని ఈ నెక్లెస్‌లో అమర్చారు. ఇక తన పట్టాభిషేకం సమయంలో రాణి ఎలిజెబెత్ ధరించిన డైమండ్ డయాడెమ్ అనే కిరీటం ఈ ప్రదర్శనలో మరో ప్రత్యేక ఆకర్షణ. బ్రిటన్ పార్లమెంట్ సమావేశాల ప్రారంభోత్సవంలో బ్రిటన్ రాణి ఈ కిరీటాన్ని ధరిస్తారు.