Politics

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్‌ 177ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదయింది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.హైవేపై పవన్‌ కాన్వాయ్‌ని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు ఫైల్‌ చేశారు. తెనాలి మారిస్‌పేటకు చెందని శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పవన్‌ కల్యాణ్‌, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.