NRI-NRT

చిత్తూరులో వైభవంగా తానా చైతన్య స్రవంతి

చిత్తూరులో వైభవంగా తానా చైతన్య స్రవంతి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరులో డిసెంబర్‌ 29వ తేదీన తానా కళోత్సవం, సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. జరిగింది. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, మహాసభల కన్వీనర్‌ రవి  పొట్లూరి, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంట్ర, లోకేష్‌ కొణిదెల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, మల్లికార్జున వేమన తదితర తానా నాయకులు హాజరయ్యారు. చిత్తూరుకు  ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, మేయర్‌ ఎస్‌ అముద, ఎమ్మెల్సీ బి.ఎన్‌. రాజసింహులు, ఆర్టీసి వైస్‌ చైర్మన్‌ ఎం.సి. విజయానంద్‌ రెడ్డి, పులివర్తి నాని, డిప్యూటీ జడ్‌పి చైర్మన్‌ ధనుంజయ రెడ్డి, మాజీ జడ్‌పి చైర్మన్‌ చంద్ర ప్రకాష్‌, గాలి భానుప్రకాశ్‌, కఠారి హేమలత తదితరులు హాజరయ్యారు. 
TANA 2022 Chaitanya Sravanthi In Chittoor
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా రెడ్‌క్రాస్‌ శాఖ సహకారంతో తానా చేయూత కార్యక్రమంలో భాగంగా మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, దివ్యాంగులకు, ఆర్థికంగా, ఉపాధిపరంగా చేయూతనిచ్చారు. 100 మంది పేద ఉత్తమ విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000/- చొప్పున స్కాలర్‌ షిప్‌ లను  అందజేశారు. ఈ స్కాలర్‌ షిప్‌లను మోహన్‌ ఈదర స్పాన్సర్‌ చేశారు. 8 మంది మహిళలకు కుట్టు యంత్రాలను(టైలరింగ్‌ మిషన్‌లు) పంపిణీ చేశారు. 15 మంది ఉత్తమ రైతులను సన్మానించడంతోపాటు వారికి అవసరమైన వ్యవసాయ రక్షణ పరికరాలను అందజేశారు. 18 మంది దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ళను ఇచ్చారు. 30 మంది పేద ఉత్తమ విద్యార్థులకు సైకిళ్ళను బహుకరించారు. ఈ వేడుకల్లో భాగంగా 10 మంది సంఘ సేవకులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులకు సేవా పురస్కారాలను తానా అందజేసింది. ఈ కార్యక్రమ విజయవంతానికి సునీల్‌ పంట్రతోపాటు మోహన్‌ ఈదర, హేమంత్‌ కూకట్ల, ఉప్పలపాటి రమేష్‌ బాబు, లంకపల్లి మహదేవ నాయుడు (చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయుల సంఘం), సాధు దిలీప్‌ కృషి చేశారు.
TANA 2022 Chaitanya Sravanthi In Chittoor
TANA 2022 Chaitanya Sravanthi In Chittoor