NRI-NRT

NATS. హైదరాబాదులో భారీ స్థాయిలో జానపద సంబరాలు.

NATS. హైదరాబాదులో భారీ స్థాయిలో జానపద సంబరాలు.

నార్త్ అమెరికా తెలుగు సొసైటీNATS ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా జానపద కళ ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ నలుమూలల నుండి జానపద కళాకారులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు తరలివచ్చి ప్రదర్శనలు ఇచ్చి అలరించారు. అదిలాబాద్ ఆదివాసీల సాంప్రదాయ నృత్యాలు బతుకమ్మ డప్పు వైద్యాలు బోనాలు గరుగు నృత్యాలు తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి తెలంగాణలో ఉన్న ప్రముఖ కళాకారులను నాట్స్ అవార్డులతో సత్కరించారు నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ అప్పసాని శ్రీధర్ అధ్యక్షుడు నూతి బాపు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి టి కిషన్ రావు ప్రముఖ రచయిత సిరా శ్రీ తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలంగాణ జానపద కళారూపాల పరిశోధకుడు సిహెచ్ కృష్ణారెడ్డి జానపద కళారూపాల సమన్వయకర్త డాక్టర్ లింగ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వచ్చే మే 26వ తేదీ నుండి మూడు రోజులపాటు న్యూజెర్సీ లో నిర్వహిస్తున్న నాట్స్ సంబరాలకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు కన్వీనర్ అప్పసాని శ్రీధర్ తెలిపారు.