Editorials

నేడు రాజా రవివర్మ . జయంతి

నేడు రాజా రవివర్మ . జయంతి

రాజా రవివర్మ భారతీయ ప్రముఖ చిత్రకారుడు. తనదైన శైలి లో రామాయణ, మహా భారతం లోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు.

చీరకట్టుకున్న స్త్రీలను అందంగా చిత్రించడంలో అతనికి అతనే సాటి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.

రాజా రవివర్మ గారు తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు.

రాజా రవివర్మ గారు చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగానూ కేరళ ప్రభుత్వము ఆయన పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారము ప్రతి ఏటా కళలు,సంస్కృతి అభ్యున్నతికై, విశేష కృషి సల్పిన వారికి ఇస్తుంది.

రాజా రవివర్మ గారి పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్ఆర్ట్స్ కళాశాలను కూడా నెలకొల్పారు.🌸🌹🙏